Indian Diplomat Vidisha Maitra Elected
to UN's ACABQ
ఐక్యరాజ్య సమితి 'ఏసీఏబీక్యూ'లోకి భారతీయురాలు
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ
అనుబంధ సంస్థ అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్
(ఏసీఏబీక్యూకి భారత్ కి చెందిన దౌత్యవేత్త విదీషా మైత్రా ఎన్నికయ్యారు. ఆసియా
పసిఫిక్ దేశాల గ్రూపు నుంచి మైత్రా 126 ఓట్లు సాధించి, గెలుపొందారు. వ్యక్తిగత అర్హతలు, అనుభవం, విశాల ప్రాంతాల ప్రాతినిధ్యం ఆధారంగా అడ్వైజరీ కమిటీకి 193 సభ్య దేశాల జనరల్ అసెంబ్లీ సభ్యులను నియమిస్తుంది. మైత్రా జనవరి 1,
2021 నుంచి మూడేళ్ళపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఐక్యరాజ్య సమితి సభ్యదేశాల
మద్దతుతో మైత్రా ఈ పదవికి ఎన్నికయ్యారని, ఐక్యరాజ్య సమితిలో
భారత శాశ్వత ప్రతినిధి తిరుమూర్తి తెలిపారు.
0 Komentar