Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Inter online admissions halted till Nov 10

 

Inter online admissions halted till Nov 10

ఇంటర్ ఆన్లైన్ ప్రవేశాలు 10 వరకు నిలుపుదల 

ఏపీలో ఇంటర్‌ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంలో ఏ నిబంధనల ప్రకారం ముందుకెళ్తున్నారని విద్యాశాఖను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల విషయంలో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్ల వల్ల విద్యార్థుల భవిష్యత్‌పై ప్రభావం పడే అవకాశముందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 

అడ్మిషన్ల సమయంలో విద్యార్థికి కౌన్సెలింగ్‌ ఇచ్చి ఏ గ్రూపులో ఆసక్తి ఉందో తెలుసుకుని సీటు కేటాయిస్తారని.. ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ వల్ల విద్యార్థి సరైన గ్రూపును ఎంచుకోలేడనే అభిప్రాయాన్ని కోర్టుకు తెలిపారు. దీనిపై పూర్తి సమాచారం అందించేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 10కి వాయిదా వేస్తూ అప్పటి వరకు స్టే విధించింది. ఈలోపు కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags