జేఈఈ మెయిన్‌పై త్వరలో స్పష్టత - ఇంటర్ బోర్డులతో చర్చించనున్న జాతీయ పరీక్షల మండలి
ఈసారి జేఈఈ మెయిన్ ఎప్పుడు
జరుగుతుందన్న దానిపై కొనసాగుతున్న సందిగ్ధతకు తెరలో తెరపడనుంది. సాధారణంగా ఆ
పరీక్షను జనవరి, ఏప్రిల్‌లో రెండుసార్లు నిర్వహిస్తారు. కరోనా కారణంగా
ఈసారి ఇంటర్ లేదా 12వ తరగతి పరీక్షలను ఆయా రాష్ట్ర
ప్రభుత్వాలతో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలు ఎప్పుడు
నిర్వహిస్తాయన్నది ఇంకా స్పష్టత రాలేదు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పరిస్థితి ఉండటంతో ఆయా బోర్డులను సంప్రదించకుండా తేదీలు ప్రకటిస్తే వార్షిక పరీక్షలకు ఇబ్బందవుతుందని జేఈఈ మెయిన్‌ను నిర్వహించే జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ) భావిస్తోంది. ఈక్రమంలో ఆయా రాష్ట్ర ఇంటర్ బోర్డులతో చర్చించాక మెయిన్ పరీక్షలను ఎప్పుడు జరిపేది వెల్లడించనున్నారు. ఈసారి 2021 ఫిబ్రవరి, మే నెలల్లో వాటిని జరపాలని ఎన్‌టీఏ భావిస్తున్నట్లు తెలిసింది. పరీక్ష కేంద్రాల ఎంపిక, ఆన్‌లైన్ పరీక్షల సాఫ్ట్‌వేర్ సమకూర్చడం తదితర బాధ్యతలను టీసీఎస్ అయాన్ సంస్థ చేపడుతుంది. తేదీలు ప్రకటించే ముందు ఈ సంస్థను ఎన్‌టీఏ సంప్రదించాల్సి ఉంది. మరో 10-15 రోజుల్లో పరీక్ష ఎప్పుడన్న దానిపై స్పష్టత వస్తుందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
0 Komentar