JNTU-H Key Decision on Credits and GPA This Year due to Corona Pandemic
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..
జేఎన్‌టీయూహెచ్ కీలక నిర్ణయం
జేఎన్‌టీయూ-హైదరాబాద్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
కరోనా నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈసారి సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌లో 7.5 GPA వచ్చినా డిస్టింక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. అంతేకాదు సప్లిలో పాసైనవారిని రెగ్యులర్‌గానే పరిగణించనున్నారు. కాగా.. ఇప్పటిదాకా 192 క్రెడిట్స్ వస్తేనే పాసైనట్లు పరిగణించగా.. ప్రస్తుతం దీన్ని 186 క్రెడిట్స్‌కు తగ్గించారు.
మరోవైపు కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం(2020-21) ఆలస్యమైంది. ఈ క్రమంలో విద్యార్ధులపై ఒత్తిడి లేకుండా సిలబస్‌లో కొన్ని మార్పులు చేయాలని పలు యూనివర్సిటీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ తరగతులను అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యూనివర్సిటీలకు సూచించింది. ఈ మేరకు అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించింది.
script async="" src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js">
0 Komentar