JNTUH: IV B.Tech / B.Pharmacy II Semester Advanced
Supplementary (Treated as Regular) Exams Nov-2020
సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులూ రెగ్యులరే! - ఆదేశాలు జారీ చేసిన జేఎన్‌టీయూ
బీటెక్, బీఫార్మసీ
చివరి ఏడాది రెండో సెమిస్టర్(4-2) అడ్వాన్స్‌డ్
సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు జేఎన్‌టీయూ సిద్ధమైంది. డిసెంబర్ 7 నుంచి పరీక్షలు పెట్టేందుకు నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల నోటిఫికేషన్‌ను
నవంబరు 7న జేఎన్‌టీయూ పరీక్షల విభాగం సంచాలకులు
ప్రొ.వి.కామాక్షిప్రసాద్ విడుదల చేశారు. నవంబరు 9 నుంచి 16 మధ్య ఫీజు చెల్లించేందుకు గడువు ఉంది. యూజీసీ ఆదేశాల మేరకు సెప్టెంబరు 16 నుంచి చివరి ఏడాది విద్యార్థులకు జేఎన్‌టీయూ పరీక్షలు నిర్వహించగా.. 95 శాతం మంది హాజరయ్యారు. తాజాగా ఫలితాలను విడుదల చేయగా బీటెక్‌లో 63శాతం మంది, బీఫార్మసీలో 47శాతం
మంది ఉత్తీర్ణులయ్యారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో పరీక్షలు రాయకపోయినా, అనుత్తీర్ణులైన విద్యార్థుల కోసం నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలను
ఈసారికి రెగ్యులర్‌గానే పరిగణిస్తామని జేఎన్‌టీయూ ఆదేశాలు జారీ చేసింది.
0 Komentar