LSAT India Registration 2021 Apply
Online
ఎల్ఎల్‌బీ
కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ప్రారంభం
ఎల్ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్‌శాట్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశంలోని ప్రముఖ యునివర్సిటీలు, లా
స్కూల్స్‌లో వచ్చే విద్యా సంవత్సరానికి ఎల్ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాల కోసం
నిర్వహించే ఎల్‌శాట్ ఇండియా నోటిఫికేషన్‌ను లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌స్యాక్)
విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 20 వరకు దరఖాస్తులు
ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రవేశ పరీక్ష మే 10, 2021 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది.
ఆసక్తి కలిగి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ఆన్‌లైన్‌లో కంప్యూటర్ ఆధారితంగా జరగనుంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఏ ఎల్ఎల్‌బీ, బీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్, బీకామ్ ఎల్ఎల్‌బీ, బీకామ్ ఎల్ఎల్‌బీ ఆనర్స్, బీబీఏ ఎల్ఎల్‌బీ, బీబీఏ ఎల్ఎల్‌బీ ఆనర్స్, బీటెక్ ఎల్ఎల్‌బీ, బీఎస్సీ ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
ముఖ్య సమాచారం:
కోర్సులు: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్
ఎల్ఎల్‌బీ, మూడేళ్ల ఎల్ఎల్‌బీ, ఎల్ఎల్ఎం
తదితర కోర్సులు.
అర్హత: ఇంటిగ్రేటెడ్ ఎల్ఎల్బీ
కోర్సుకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
ఎల్ఎల్బీ కోర్సుకు డిగ్రీ, ఎల్ఎల్ఎం కోర్సుకు ఎల్ఎల్‌బీ
పూర్తిచేయాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం: ఇందులో అనలిటికల్
రీజనింగ్, లాజికల్ రీజనింగ్, రీడింగ్
కాంప్రహెన్షన్ విభాగాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ: 2021, ఏప్రిల్ 20
అడ్మిట్‌కార్డులు: ఏప్రిల్‌లో
ప్రవేశపరీక్ష: మే 10
నుంచి
వెబ్‌సైట్:
0 Komentar