MBBS/BDS Admission 2020: Notification for
Admission Into MBBS And BDS Courses
KNRUHS: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలు ఇవే..!
Telangana NEET State Ranks 2020: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు నోటిఫికేషన్ విడుదలైంది.
నవంబర్ 1నుంచి
8 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు రిజిస్ట్రేషన్ సౌకర్యం
తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్‌లైన్ దరఖాస్తుల నమోదుకు కాళోజి నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేడు నోటిఫికేషన్ విడుదల చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు నమోదు చేసుకోవాలని తెలిపారు. కరోనా వైరస్ దృష్ట్యా ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలిన పీజీ తరహాలోనే యూజీ ప్రవేశాలకు కూడా చేపట్టనున్నారు.
అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవల్సిన వెబ్‌సైట్: https://tsmedadm.tsche.in/
నవంబర్ 1 నుంచి నవంబర్ 8 వరకు ఉదయం 8 గంటల నుంచి సాయింత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. నిర్దేశిత ధరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లను స్కాన్ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు.
ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర
సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్ సైట్ http://www.knruhs.telangana.gov.in/ లో సందర్శించాలని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.
0 Komentar