Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MDM: Headmasters - Must Do in MDM App and IMMS On Daily Basis

MDM: Headmasters - Must Do in MDM App and IMMS On Daily Basis

మధ్యాహ్న భోజన పధకం సంబంధించి ప్రధానోపాధ్యాయుల రోజువారీ పనులు

1. ప్రతిరోజూ JAGANANNA GORUMUDDA(MDM) యాప్ లో  హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను. దీనిలో నమోదు చేసిన వివరాలు మేరకు మాత్రమే Bills చేయబడతాయి. మీరు ఎంటర్ చేసిన వివరాలు సవరణలు చేయడం కుదరదు కాబట్టి ఎంటర్ చేసేటప్పుడు ఒకమారు చూసుకుని సబ్మిట్ చేయగలరు. 

2. అదే విదంగా ప్రతిరోజూ IMMS యాప్ లో HM services లో హాజరు అయిన విధ్యార్ధులు మరియు భోజనం చేస్తున్న విధ్యార్ధులు వివరాలు విధిగా నమోదు చేయవలెను. 

3. ప్రతిరోజూ IMMS యాప్ లో Jagananna Gorumudda(MDM) లో inspection form లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను. 

4. ప్రతిరోజూ IMMS యాప్ లో Sanitation Monitoring System(SMS) లో inspection form లో అడిగిన వివరాలు నింపి ప్రతి రోజు ప్రధానోపాధ్యాయులు సబ్మిట్ చేయవలెను. 

పైన చెప్పబడిన 4 పాయింట్లు అందరు ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజూ తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. 

IMMS అనేది ఆదునికంగా రూపొందించబడిన యాప్ ఇది Chief Minster Dash Board వరకు అనుసంధానం అయి ఉంది కాబట్టి సబ్మిట్ చేయని ప్రధానోపాధ్యాయుల వివరాలు వారికి స్పష్టంగా కనబడుతుంది గమనించగలరు. 

IMMS APP నిర్వహణ లో ప్రధానోపాధ్యాయులు జాగ్రత వహించవలసిన ఇంకొన్ని వివరాలు. 

IMMS యాప్ inspection లో బాగంగా 4-tire మానిటరింగ్ సిస్టమ్ గా రూపొందించబడినది. అందులో బాగంగా

1. ప్రధానోపాధ్యాయులు inspection 

2. PMC కమిటీ inspection 

3. Welfare/Ward Education Assistant inspection 

4. Village Organiser inspection 

పైన తెలుపబడిన నలుగురకు ఇదివరకే id లు ఇవ్వబడ్డాయి. ఇందులో మీకు 2,3,4 వారి యొక్క id లు ఇప్పటికే మీ పాఠశాలకు మ్యాప్ చేయబడ్డాయి. వాళ్ళు కూడా మీ పాఠశాలకు వచ్చి మధ్యాహ్న భోజన పధకం అమలును పరిశీలించి IMMS యాప్ లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. 

కాబట్టి IMMS యాప్ విషయం లో అందరు ప్రధానోపాధ్యాయులు కూడా తగు శ్రద్ధ వహించి పై విషయాలలో ఎంటువంటి అలసత్వం వహించకుండా “జగనన్న గోరుముద్ద పధకం”  విజయవంతం గా ముందుకు సాగేలా చూడగలరని అందరు ప్రధానోపాధ్యాయులకు కొరడమైనది.

Previous
Next Post »
0 Komentar

Google Tags