MHA issues new COVID-19 guidelines from
Dec 1; Here's what's allowed, what's not
డిసెంబర్ 1 నుంచి 31 వరకు రాష్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న వేళ కేంద్రం సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ వైరస్ వ్యాప్తికి కళ్లెం వేయడమే లక్ష్యంగా డిసెంబర్ 1 నుంచి 31 వరకు రాష్టాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాల్సిన కొవిడ్ నిబంధనలను బుధవారం ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కొత్త కేసులు పెరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో దృష్టి కేంద్రీకరించి వ్యాప్తిని కట్టడి చేయాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల లాక్ డౌను కేంద్రం అనుమతి తప్పనిసరి అని కేంద్రం స్పష్టంచేసింది. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర కార్యకలాపాలకు మాత్రమే అనుమతించింది. కంటైన్మెంట్ జోన్లలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఈ బాధ్యత పోలీసులు, జిల్లా యాంత్రాంగానిదేనని స్పష్టంచేసింది. స్థానిక పరిస్థితుల ఆధారంగా రాత్రిపూట కర్ఫ్యూ వంటి నిబంధనలు రాష్ట్రాలు విధించుకోవచ్చని కేంద్ర హోంశాఖ తెలిపింది.
మాస్కులు ధరించకపోతే జరిమానా
కరోనా ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితులలో తప్ప మిగతా సమయంలో కఠిన నిబంధనలు అమలుచేయాలని సూచించింది. మాస్క్ లు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతికదూరం పాటించడం వంటి అంశాలపై ప్రజల్లో మరింత చైతన్యం కలిగించాలని సూచించింది. కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించని వారికి తగిన జరిమానా విధించాలని తెలిపింది.
కంటైన్ మెంట్ జోన్ల వెలుపల అన్ని కార్యకలాపాలకూ కేంద్రం అనుమతిచ్చింది. అంతర్జాతీయ ప్రయాణికులను కేంద్ర హోంశాఖ నిబంధనల ప్రకారం అనుమతించాలని తెలిపింది. “50శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు తెరుచుకోవచ్చు . క్రీడాకారుల శిక్షణ నిమిత్తం మాత్రమే స్విమ్మింగ్ పూకు అనుమతి. సామాజిక, ఆధ్యాత్మిక, క్రీడా/ వినోదం/ విద్య/సాంస్కృతిక/ మతపరమైన కార్యక్రమాలకు 50శాతం సామర్థ్యంతో హాలులోకి అనుమతించాలి. ఇతర కార్యక్రమాలకు 200 మందికి మించరాదు. రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. ఆరోగ్య సేతు యాప్ వాడకాన్ని ప్రోత్సహించాలి" అని రాష్ట్రాలకు సూచించింది.
0 Komentar