Naturally Delicious Salt Substitutes - Know Here All Details
కూరల్లో ఉప్పు బదులు వీటిని
వాడుకోవచ్చట..
ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు.. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. మరి దీని బదులు మనం ఏమేం ఆల్టర్‌నేటీవ్‌గా వాడొచ్చో తెలుసుకోండి..
ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉప్పు ఎక్కువైతే అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఉదాహరణకి, ఎక్కువ ఉప్పు బీపీ పెంచుతుంది, అందుకని హైబీపీ తో బాధ పడే వారు ఉప్పు బాగా తగ్గించి తీసుకోవాలి. పైగా, ఉప్పు వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంతే కాక, ఇమ్యూన్ సిస్టమ్ కూడా బలహీనపడుతుందని కొన్ని స్టడీస్ చెబుతున్నాయి. ఎప్పుడైతే రోగ నిరోధక శక్తి బలహీన పడుతుందో అప్పుడు శరీరానికి బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్స్ తో పోరాడే శక్తి పోతుంది. అందుకే, తీసుకునే ఆహారం లో ఉప్పు కొద్దిగా తగ్గించడానికి ఇవిగో ఇక్కడ కొన్ని చిట్కాలున్నాయి.
18 చిట్కాలు ఇవే:
1. ఉప్పు బదులు లెమన్ పౌడర్, ఆమ్‌చూర్ పౌడర్, వాము పొడి, మిరియాల పొడి, ఒరెగనో వంటివి యూజ్ చేయవచ్చు.
2. వంట మొదట్లో ఉప్పు వేసే బదులు చివర్లో వేస్తే ఉప్పు తక్కువ వేయవచ్చు. పైగా, అప్పుడు వంటకం కూడా ఎక్కువ ఉప్పు తీసుకోకుండా ఉంటుంది.
3. ఊరగాయలు, అప్పడాలు, సాస్, నమ్‌కీన్ వంటి వాటిలో ఉప్పు ఉంటుంది. అందుకని, ఇవి తీసుకోవడం తగ్గిస్తే మంచిది.
4. ఆయిల్, బటర్ వంటివి ఉప్పు వాడకాన్ని బాగా తగ్గిస్తాయి. వాటిలో ఉండే ఫ్లేవర్ వల్ల ఉప్పు తగ్గిందని కూడా మనకి తెలియదు.
5. పసుపు, జీల కర్ర పొడి, మిరియాల పొడి, పుదీనా, కొత్తిమీర వంటివి ఉప్పు తగ్గిందన్న విషయం తెలియకుండా మ్యానేజ్ చేయగలవు. అందుకని వంటలో ఇవి రెగ్యులర్ గా వాడుతూ ఉండవచ్చు.
6. కొద్దిగా సాటీ చేసిన ఉల్లి, వెల్లుల్లి కూడా వంటకానికి మంచి రుచినీ, పరిమళాన్నీ తీసుకువస్తాయి.
7. మీరు రెస్టారెంట్స్ లో తినదల్చుకున్న ఫుడ్స్ యొక్క రెసిపీస్ ని ఇంటర్నెట్ లో ఒకసారి చూడండి. ఉప్పు ఎక్కువగా యూజ్ చేసే పదార్ధాలని ఎవాయిడ్ చేసి ఉప్పు తక్కువగా ఉండే ఫుడ్స్ ని ఆర్డర్ చేయండి.
8. జస్ట్ వడ్డించడానికి ముందు కొద్దిగా ఫ్లేవర్డ్ వెనిగర్, లేదా ఫ్రెష్ లెమన్ జ్యూస్ వంటకం మీద చల్లితే వంటకానికి మంచి రుచి వస్తుంది.
9. మార్కెట్ లో కొనే పదార్ధాలలో ఎంత ఉప్పు ఉందో లేబుల్స్ చదివి అప్పుడు కొనండి. మనకి తెలియకుండానే కొన్ని ఫుడ్స్ ద్వారా సాల్ట్ లోపలికి వెళ్ళిపోతుంది.
10. ఫ్రోజెన్ ఫుడ్స్ లో చాలా వరకూ ఉప్పు కలుస్తుంది. అందుకని వీటిని ఎంత ఎవాయిడ్ చేయగలిగితే అంత మంచిది.
11. హోల్ ఫుడ్స్ మీద ఫోకస్ చేయండి. వీటిలో ఉప్పు తక్కువగా ఉంటుంది.
12. పొటాషియం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోండి. అప్పుడు మీ ఎలెక్ట్రొలైట్స్ బ్యాలెన్స్ అవుతాయి. బంగాళా దుంపలు, బ్రకోలి, బనానా వంటివి పొటాషియం ఎక్కువగా ఉండే పదార్ధాలు.
13. మీరు తీసుకునే ఫుడ్ లో ఒక క్యాలరీకి ఒక మిల్లీ గ్రాం ఉప్పు కంటే ఎక్కువగా తీసుకోకూడదు అనే రూల్ పెట్టుకోండి. ఆటోమేటిక్ గా ఉప్పు తీసుకోవడం తగ్గుతుంది.
14. రెస్టారెంట్స్ లో తినేటప్పుడు సూప్ ఎవాయిడ్ చేయండి. సూప్ లో ఎక్కువ సోడియం కలుస్తుంది. సూప్ బదులు ఫ్రెష్ వెజిటబుల్స్ తో చేసిన సలాడ్ ఆర్డర్ చేయండి.
15. మనం రుచి అనుకునే వాటిలో చాలా వరకూ వాసనకి సంబంధించినదే. అందుకని పుదీనా వెల్లుల్లి వంటివి వంటకం లో యాడ్ చేస్తే కొద్దిగా ఉప్పు తగ్గినా కూడా తెలియదు.
16. ఉప్పు చల్లిన నట్స్, సాల్టెడ్ చిప్స్ బదులు అన్‌సాల్టెడ్ వెరైటీస్ ని ప్రిఫర్ చేయండి.
17. డేలీ మీట్, సాసేజెస్ బదులు స్కిన్‌లెస్ చికెన్, లీన్ మీట్, సీ ఫుడ్ తీసుకోండి.
18. స్నాక్స్ టైమ్ లో కొబ్బరి నీరు, యోగర్ట్, ఫ్రూట్ వంటివి తీసుకుంటే ఆ మేర సాల్ట్ తగ్గినట్లే.
ఉప్పు తగ్గించి తీసుకోవడం వల్ల ఉండే లాభాలు:
1. బ్లడ్ లో ఫ్లూయిడ్
అమౌంట్ తగ్గిన కొద్దీ మీ బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గుతుంది.
2. హైబీపీ కంట్రోల్ లోకి
వచ్చినప్పుడు హార్ట్ డిసీజెస్ యొక్క రిస్క్ కూడా రెడ్యూస్ అవుతుంది.
3. చెడు కొలెస్ట్రాల్
లెవెల్స్ కూడా తగ్గుతాయి.
4. కంజెస్టివ్ హార్ట్
ఫెయిల్యూర్ ని ప్రివెంట్ చేయవచ్చు.
5. కిడ్నీ డ్యామేజ్ జరిగే
రిస్క్ కూడా బాగా డిక్రీజ్ అవుతుంది.
6. స్ట్రోక్ వచ్చే రిస్క్
ని ప్రివెంట్ చేయవచ్చు.
7. బ్రెయిన్ యాన్యుమరిజం
వచ్చే ఛాన్స్ కూడా బాగా రెడ్యూస్ అవుతుంది.
8. కంటి చూపు బాగుంటుంది.
9. బ్లోటింగ్ బాగా కంట్రోల్
అవుతుంది.
10. డయాబెటిస్ వచ్చే రిస్క్
తగ్గుతుంది.
11. జ్ఞాపక శక్తి మెరుగు
పడుతుంది.
12. డిమెన్షియా వచ్చే
రిస్క్ తగ్గుతుంది.
13. ఆర్టరీ వాల్స్ థిక్
అయిపోయే అవకాశం తగ్గుతుంది.
14. సాల్ట్ ఎక్కువైనప్పుడు
దాహం గా అనిపిస్తుంది. చాలా సార్లు హై క్యాలరీ డ్రింక్స్ వైపు వెళ్ళిపోతాం. ఉప్పు
తగ్గించినప్పుడు ఈ మొత్తం సమస్య తగ్గుతుంది.
15. ఎముకలు బలంగా
తయారవుతాయి.
16. గుండె పని తీరు మెరుగు
పడుతుంది.
17. కిడ్నీల్లో రాళ్ళు
ఏర్పడే రిస్క్ తగ్గుతుంది.
18. స్టమక్ కాన్సర్ కి కారణమయ్యే ఒక బ్యాక్టీరియా హై సాల్ట్ కంటెంట్ మీద బతుకుతుంది. ఉప్పు తగ్గిస్తే ఈ కాన్సర్ వచ్చే రిస్క్ కూడా గణనీయంగా తగ్గుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల
ప్రకారం ఈ వివరాలను అందించాం.
0 Komentar