Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NCL Recruitment 2020 - Technical Officer & Other Posts

 


NCL Recruitment 2020 - Technical Officer & Other Posts

బీఈ/బీటెక్‌ వాళ్లకి టెక్నికల్‌ జాబ్స్‌..‌ ఎన్‌సీఎల్‌ నోటిఫికేషన్‌ విడుదల

National Chemical Laboratory: ఎన్‌సీఎల్‌ 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

వివిధ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న టెక్నిక‌ల్ అసిస్టెంట్‌‌, సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నేష‌న‌ల్ కెమిక‌ల్ ల్యాబొరేట‌రీ (ఎన్‌సీఎల్‌) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 45 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హ‌త‌, ఆస‌క్తి, అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగం పొందిన‌వారు పుణెలో ప‌నిచేయాల్సి ఉంటుంది. డిసెంబర్‌ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల‌ను ప్రింట్ తీసి సంబంధిత చిరునామాకు డిసెంబర్‌ 31లోపు పంపించాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://recruit.ncl.res.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. 

మొత్తం పోస్టులు: 45

సీనియ‌ర్ టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌- 3

టెక్నిక‌ల్ ఆఫీస‌ర్- 12

టెక్నిక‌ల్ అసిస్టెంట్‌- 10

టెక్నీషియ‌న్- 20 

ముఖ్య సమాచారం:

అర్హ‌త‌: ‌పోస్టులను బట్టి మారుతూ ఉంటుంది. విద్యార్హత వివరాలను నోటిఫికేషన్‌లో చూడొచ్చు.

వయసు: పోస్టులను బట్టి 28-40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష ద్వారా‌ ఎంపిక చేస్తారు.

ద‌రఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 2, 2020

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ: డిసెంబ‌ర్ 2, 2020

హార్డు కాపీలను పంపడానికి చివరితేది: డిసెంబర్‌ 31, 2020

వెబ్‌సైట్‌: http://recruit.ncl.res.in/

NOTIFICATION

Previous
Next Post »
0 Komentar

Google Tags