NEET 2020 State Ranks List Released - Andhra Pradesh And Telangana Ranks List
నీట్ రాష్ట్ర స్థాయి ర్యాంకుల
విడుదల.. తెలంగాణ, ఏపీ జాబితా కోసం క్లిక్ చేయండి..!
Telangana NEET State Ranks 2020: నీట్‌లో అర్హత సాధించిన రాష్ట్ర స్థాయి ర్యాంకర్ల జాబితా ఇక్కడ తెలుసుకోవచ్చు.
నీట్‌లో అర్హత సాధించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి ర్యాంకర్ల ప్రాథమిక సమాచారాన్ని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం విడుదల చేసింది. అఖిల భారత స్థాయిలో మూడో స్థానంలో నిలిచిన తుమ్మల స్నికిత రాష్ట్రంలో తొలి ర్యాంకును కైవసం చేసుకుంది. టాప్ టెన్‌లో 1, 3, 8 ర్యాంకుల్లో ముగ్గురు బాలికలు నిలిచారు. తొలి 50 ర్యాంకుల్లో బాలురు 29 స్థానాలు పొందారు.
సాధారణంగా రాష్ట్ర స్థాయి ప్రాథమిక ర్యాంకులను వెల్లడించిన తర్వాత దరఖాస్తులను ఆహ్వానించి.. అందులో నుంచి తుది ర్యాంకులను ప్రకటిస్తారు. ఈసారి ఇప్పటికే నీట్ నిర్వహణలో జాప్యం జరిగినందున.. ప్రాథమిక ర్యాంకులతో పాటు ప్రవేశ ప్రకటనను ఒకేసారి వెలువరించనున్నట్లు కాళోజీ ఆరోగ్యవర్సిటీ వర్గాలు తెలిపాయి.
నవంబరు 1వ తేదీన ఆన్‌లైన్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్యవిద్యలో ప్రవేశాలకు ప్రకటన వెలువడనుంది. దాదాపు 7రోజులు దరఖాస్తులకు గడువిస్తారు. వీటి నమోదు ప్రక్రియ పూర్తయ్యాక ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ ప్రక్రియకు 10 రోజులు పట్టే అవకాశం ఉండడంతో.. నవంబరు 20న వైద్యవిద్య ప్రవేశాల్లో సీట్ల కేటాయింపు తొలివిడత ఫలితాలను విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ జాబితా:
తెలంగాణ ర్యాంకుల జాబితాను http://www.knruhs.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో పొందొచ్చు.
ఏపీ జాబితా:
0 Komentar