NPCI Allows WhatsApp Payments Service to
Go Live On UPI
వాట్సాప్ చెల్లింపులకు ఎన్‌పిసిఐ
ఆమోదముద్ర
మెసేజింగ్ యాప్, వాట్సాప్
ద్వారా చెల్లింపులకు ఎన్‌పిసిఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆమోదం
తెలిపింది. భారత్ లో వాట్సాప్
వినియోగదారులు దాదాపు 40 కోట్ల మంది ఉన్నారు. (గూగుల్ పే యూజర్లు 7.5 కోట్లు,
ఫోన్ పే యూజర్లు 6 కోట్ల మంది ఉన్నారు)ఈ ఆమోదంతో డిజిటల్
చెల్లింపులు మరింత జోరుగా పెరుగుతాయని అంచనా. గూగుల్ పే, ఫోన్
పే వంటి ధర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్లు(టీపీయాప్స్) లావాదేవీలపై పరిమితి విధించిన
నిమిషాల వ్యవధిలోనే ఎన్‌పిసిఐ వాట్సాపు ఈ ఆమోదాన్ని ఇచ్చింది. మొత్తం యూపీఐ
(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్) లావాదేవీల్లో ఒక్కోయాప్ లావాదేవీ 30
శాతానికి మించకూడదన్న పరిమితిని
ఎన్‌పిసిఐ విధించింది. గత నెలలో యూపీఐ లావాదేవీలు 200 కోట్లను మించాయి. రానున్న కాలంలో ఈ లావాదేవీలు మరింతగా పెరిగే అవకాశాలుండటంతో ఒక్కో యాపు ఈ పరిమితిని ఎన్‌పిసిఐ విధించింది.
0 Komentar