NVS Admission for 6th and 9th
Classes
నవోదయ' ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా ఎంపిక
పరీక్షలు నిర్వహిస్తారు
అర్హులైన వారు ఎంపిక పరీక్షకు
డిసెంబరు 15లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ పాఠశాలు, ప్రభుత్వంచే
గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో ఐదవ
తరగతి చదువుతున్న బాల, బాలికలు ఎంపిక పరీక్ష రాసేందుకు
అర్హులు.
వీరు 2008, మే 1వ తేదీ నుంచి 2012, ఏప్రిల్ 30 మధ్య జన్మించిన వారై ఉండాలి.
ఎంపిక పరీక్షలు
ఆంగ్లం, హిందీ, కన్నడ, ఇతర భాషలతో పాటు తెలుగులోనూ నిర్వహిస్తారు.
దరఖాస్తు ఇలా....
దరఖాస్తును www.navodaya.gov.in website ద్వారా డౌన్లోడ్
చేసుకోవాలి. దానిని పూరించి తిరిగి అదే వెబ్ సైట్లో డిసెంబరు 15వ తేదీలోగా అప్లోడ్ చేయాలి.
దరఖాస్తును ఒక ప్రింట్ తీసుకుని, విద్యార్ధుల
వద్ద ఉంచుకోవాలి.
తొమ్మిదవ తరగతికి పరీక్ష..
నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదవ తరగతిలో మిగిలి ఉన్న సీట్లకు ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రవేశం కోరే బాల, బాలికలు కూడా వెబ్ సైట్ నుంచి దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని దానిని పూరించి డిసెంబరు 15వ తేదీలోగా అప్లోడ్ చేయాలి.
పరీక్షలు ఎప్పుడంటే..
ఆరో తరగతిలో ప్రవేశం కోరే
విద్యార్ధులకు 2021 ఏప్రిల్ 10వ తేదీన ఎంపిక
పరీక్ష నిర్వహిస్తారు.
తొమ్మిదవ తరగతిలో ప్రవేశం కోరే
విద్యార్థులకు 2021, ఫిబ్రవరి 18వ తేదీన ఎంపిక
పరీక్ష నిర్వహిస్తారు.
0 Komentar