Once in High Demand Civil and Mechanical
Engineering Lose Out to New Age Tech Courses
కాలం చెల్లిన ఇంజనీరింగ్
కోర్సులు.. సగం కూడా నిండని సీట్లు..!
ఒకప్పుడు ఇంజినీరింగ్‌లో ఎవర్‌గ్రీన్
కోర్సులకు ప్రస్తుతం కాలం చెల్లిన పరిస్థితి.
ఇంజనీరింగ్ విద్యలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సంప్రదాయ ఇంజనీరింగ్ కోర్సులకు క్రమంగా స్వస్తి పలుకుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా అందుబాటులోకి వస్తున్న కొత్త బ్రాంచీలవైపు విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. భారీ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న నూతన సాంకేతిక కోర్సులైన కృత్రిమ మేధ (ఎఐ), బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, డేటా సైన్సెస్, సైబర్ భద్రత, 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్ తదితర కోర్సులవైపు ఆకర్షితువులవుతున్నారు.
ఈ క్రమంలో.. ఒకప్పుడు ఇంజినీరింగ్‌లో ఎవర్‌గ్రీన్ కోర్సులకు ప్రస్తుతం కాలం చెల్లిన పరిస్థితి. ముఖ్యంగా.. పురాతన కోర్సులైన మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ కోర్సులపై ఆ ప్రభావం తీవ్రంగా పడుతున్నది. ఈ కోర్సుల్లో చదవడానికి విద్యార్థులు ముందుకు రాకపోవడంతో ప్రతి ఏడాది సీట్లు మిగిలిపోతున్నాయి. దీంతో కాలేజీలు కూడా ఈ బ్రాంచీల సీట్లలో కోత విధిస్తున్నాయి.
సీట్ల కోత
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మిషన్ లెర్నింగ్, డాటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐవోటీ వంటి మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉండే కోర్సులను విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్నారు. దీంతో మెకానికల్, సివిల్ కోర్సులు మరుగున పడిపోతున్నాయి. యాజమాన్యాలు కూడా డిమాండ్ అనుగుణంగా ఉండే ఇంజినీరింగ్ కోర్సులను మాత్రమే కొనసాగిస్తూ.. మిగిలిన కోర్సులకు సంబంధించిన సీట్లను తగ్గించుకుంటున్నాయి.
భారీగా మిగులుతున్న సీట్లు:
గతేడాది వరకు మెకానికల్ ఇంజినీరింగ్‌లో దాదాపు 10 వేలకు పైగా సీట్లు ఉండేవి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2020–21) ఆ సంఖ్య 6,059కి పడిపోయింది. అందులోనూ 3,287 సీట్లు మాత్రమే నిండాయి. ఇంకా 2,772 సీట్లు మిగిలిపోయాయి. సివిల్ ఇంజినీరింగ్‌లో కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
సివిల్ ఇంజినీరింగ్ బ్రాంచీలో 6,415 సీట్లు ఉండగా, 3,722 సీట్లు మాత్రమే నిండాయి. కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు, ఇంజినీరింగ్ కాలేజీల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలకు మధ్య చాలా తేడా ఉండటం.. ఉపాధి అవకాశాల కోసం కష్టపడాల్సి రావడమే ప్రధాన సమస్యగా చెబుతున్నారు. ఈ వ్యత్యాసాలను పూడ్చి.. కోర్సులను రీస్ట్రక్చరింగ్ చేసి.. యువతకు ఉపాధి అవకాశాలు లభించేలా డిజైన్ చేయడమే పరిష్కార మార్గమని నిపుణుల అభిప్రాయం.
0 Komentar