Nominee for Motor Vehicles Proposed for
Smoother Transfer of Ownership
వాహనదారులకు సర్కార్ తీపికబురు..
కొత్త రూల్స్!
వెహికల్ కొనుగోలుదారులకు తీపికబురు అందనుంది. మోదీ సర్కార్ కొత్త రూల్స్ తీసుకురావడానికి రెడీ అవుతోంది. దీంతో వెహికల్ ఓనర్‌షిప్‌ను సులభంగానే మార్చుకోవచ్చు. దీంతో చాాలా మందికి ఊరట కలుగనుంది.
వెహికల్ ఓనర్‌షిప్ సులభతరం
వాహనాన్ని మరొకరి పేరు పైకి ఈజీగా
మార్చుకోవచ్చు
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. కొత్త రూల్స్ అమలులోకి తీసుకురావాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే మోదీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. రోడ్డు రవాణ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989కు సవరణ చేయాలని ప్రతిపాదించింది.
కేంద్ర ప్రభుత్వం వెహికల్ ఓనర్‌షిప్ రూల్స్‌కు సంబంధించి మార్పులు చేయడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వెహికల్‌కు కూడా నామినీ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో ఓనర్‌తోపాటు నామినీ పేరును కూడా యాడ్ చేసేలా కొత్త రూల్స్ అమలులోకి రాబోతున్నాయి. వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలోనే కాకుండా తర్వాత కూడా నామినీ పేరును యాడ్ చేసుకునే వెసులుబాటు అందుబాటులో ఉండొచ్చు. ఆన్‌లైన్‌లోనే నామినీని యాడ్ చేసుకోవచ్చు.
కొత్త రూల్స్ అమలులోకి వస్తే..
వెహికల్ ఓనర్ మరణించినప్పుడు ఆ వాహనాన్ని సులభంగానే నామినీ పేరు పైకి
మార్చుకోవచ్చు. వెహికల్ యజమాని మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే సరిపోతుంది.
వెహికల్ నామినీ పేరు పైకి మారిపోతుంది. ఒకవేళ నామినీ పేరు లేకపోతే కుటుంబ సభ్యులు
ఎవరైనా తామే వాహన యజమానికి చట్టపరమైన వారసులమని అనే తెలియజేసే ప్రూప్స్ ఇవ్వాల్సి
ఉంటుంది.
0 Komentar