Google tests Task Mate app in India,
will pay users to perform simple tasks
ఈ గూగుల్ యాప్ ఇన్‌స్టాల్
చేసుకుంటే మీ స్మార్ట్ ఫోన్ ద్వారానే డబ్బులు సంపాదించవచ్చు!
Task Mate App: టెక్ దిగ్గజం గూగుల్ మనదేశంలో టాస్క్ మేట్ యాప్‌ను పరీక్షిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు స్మార్ట్ ఫోన్ ద్వారానే డబ్బులు సంపాదించవచ్చు.
స్మార్ట్ ఫోన్‌లో పనులు చేయవచ్చు
ప్లేస్టోర్‌లో అందుబాటులో..
కానీ రిఫరల్ కోడ్ తప్పనిసరి
గూగుల్ టాస్క్ మేట్ యాప్‌ను మనదేశంలో పరీక్షిస్తున్నారు. ఫోన్‌లో చిన్న చిన్న పనులు చేయడం ద్వారా డబ్బులు సంపాదించేందుకు ఈ యాప్ సాయపడుతుంది. టాస్క్ మేట్ యాప్ ప్రపంచంలో వేర్వేరు వ్యాపార సంస్థలు పోస్ట్ చేసే పనులను మనకు అప్పగిస్తుంది. స్మార్ట్ ఫోన్‌లో ఫొటోలు క్లిక్ చేయడం, సర్వే ప్రశ్నలకు సమాధానాలివ్వడం, ఇంగ్లిష్ నుంచి వాక్యాలను ఇతర భాషలకు అనువదించడం వంటి పనులు చేస్తూ డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే ఈ యాప్ ప్రస్తుతానికి మనదేశాంలో బీటా దశలోనే ఉంది. కొంతమంది ఎంపిక చేయబడ్డ టెస్టర్లకు మాత్రమే రిఫరల్ కోడ్ ద్వారా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది.
వినియోగదారులకు అందించిన టాస్క్‌లు పూర్తి చేయగానే స్థానిక కరెన్సీలో వారికి డబ్బులు అందుతాయి. ఈ టాస్క్ మేట్ టెస్టింగ్‌ను ఒక రెడ్డిట్ యూజర్ గుర్తించారు. ఈ విషయాన్ని9టు5గూగుల్ మొదట గుర్తించింది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోనే ఉంది. కానీ మీ దగ్గర రిఫరల్ కోడ్ లేకుండా మీరు దీన్ని ఉపయోగించలేరు. ఇది ఇన్వైట్ కోడ్ ద్వారా మాత్రమే దొరుకుతుంది.
టాస్క్ మేట్ యాప్‌ను ఉపయోగించాలంటే మూడు స్టెప్స్‌ను కచ్చితంగా పాటించాలి. దీన్ని ఆ యాప్ డిస్క్రిప్షన్‌లో అందించారు. దీనికి ముందుగా టాస్క్‌లను గుర్తించాలి, తర్వాత ఆ టాస్క్ పూర్తి చేసి, దాని క్యాష్ అవుట్ చేసుకోవాలి. కూర్చుని పూర్తి చేసే టాస్క్‌లు, ఫీల్డ్ టాస్కులు కూడా ఇందులో ఉంటాయి. దీన్ని చూస్తే గూగుల్ నేరుగా టాస్క్ అడుగుతున్నట్లు కనిపిస్తుంది. యాప్‌లో మీరు ఎన్ని టాస్క్‌లు పూర్తి చేశారు. వాటిలో ఎన్ని సరిగ్గా చేశారు, మీ లెవల్ ఏంటి? ఎన్ని టాస్కులు రివ్యూలో ఉన్నాయి వంటివి తెలుసుకోవచ్చు.
ఒకవేళ ఈ టాస్క్ పూర్తి చేయడానికి ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే.. మీరు అక్కడికి వెళ్లడానికి ఎంత సమయం పడుతుందో కూడా ఆ యాప్‌లో పేర్కొంటారు. ఆ టాస్క్ ద్వారా మీకు ఎంత ఆదాయం వస్తుంది వంటి వాటిని కూడా ఇందులో తెలుసుకోవచ్చు. షాప్ ముందు నుంచుని ఫొటోలు తీయడం వంటివి గూగుల్ మ్యాపింగ్ సర్వీసులను మెరుగుపరిచి ఆ షాపులను ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తుంది. మీకు ఆ టాస్క్ చేయడంపై ఆసక్తి లేకపోతే.. దాన్ని మీరు స్కిప్ చేయవచ్చు.
ఇక పేమెంట్ విషయానికి వస్తే.. మీరు థర్డ్ పార్టీ ప్రాసెసర్ ద్వారా మీ అకౌంట్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. టాస్క్‌ల ద్వారా మీరు సంపాదించిన డబ్బును క్యాష్ అవుట్ చేసుకునేటప్పుడు మీరు ఈ-వ్యాలెట్ లేదా ఖాతా వివరాలను పేమెంట్ పార్ట్‌నర్ ద్వారా టాస్క్ మేట్ యాప్‌లో అందించవచ్చు. తర్వాత మీరు దాన్ని స్థానిక నగదులోకి మార్చుకుని విత్‌డ్రా చేసుకోవచ్చు.
0 Komentar