Reduction of 5,000 Engineering seats in JNTU, Anantapur
అనంతపురం పరిధిలో 5వేల సీట్ల
తగ్గింపు - 49 ఇంజినీరింగ్ కళాశాలల మూత
రెండు ఫార్మసీ కళాశాలలకు అనుమతులు
నిలిపివేత
మొత్తంగా 17,700 సీట్లకు కోత
రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో 49 ఇంజినీరింగ్, 2 బీఫార్మసీ కళాశాలలు మూతపడనున్నాయి. మరో రెండు ఇంజినీరింగ్ కళాశాలలపై జేఎన్‌టీయూ కాకినాడ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది. వీటికి అనుబంధ గుర్తింపు నిలిపివేస్తే మొత్తం మూతపడే కళాశాలల సంఖ్య 53కు చేరుతుంది. ఇవి కాకుండా మరో 62 ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లకు కోత విధించారు. ఈ ఏడాది మొత్తంగా సుమారు 17,700 సీట్లకు కోతపడనుంది. గత రెండు రోజులుగా అనంతపురం, కాకినాడలోని జేఎన్‌టీయూ పాలకవర్గాల సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఆ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.
జేఎన్‌టీయూ కాకినాడ పరిధిలో 26 ఇంజినీరింగ్, 2 బీఫార్మసీ కళాశాలలు ఈ ఏడాది మూతపడనున్నాయి. మరో రెండు కళాశాలలపై నిర్ణయం పెండింగ్‌లో ఉంది. మొత్తంగా 30 కళాశాలలకు అనుమతులు నిలిపివేసే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం లేని 45 ఇంజినీరింగ్ కళాశాలల్లోని 4,800 సీట్లు తగ్గించారు. మూతపడే వాటితో కలిపి సుమారు 12,600 సీట్ల వరకు తగ్గే అవకాశముంది.
జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో 23
కళాశాలలకు అనుమతులు నిలిపివేయనున్నారు. 17కళాశాలల సీట్లలో కోత విధించారు. ఈ
వర్సిటీ పరిధిలో 41వేల ఇంజినీరింగ్ సీట్లు ఉండగా.. ఈసారి 5,100 సీట్లు
తగ్గనున్నాయి.
0 Komentar