RITES Recruitment 2020 For 170 Engineer
Posts
బీఈ/బీటెక్ వాళ్లకు గుడ్ ఛాన్స్..
రైట్స్‌లో 170 ఇంజినీర్ జాబ్స్
RITES Engineer Recruitment 2020: ఆర్ఐటీఈఎస్‌లో ఖాళీగా ఉన్న 170 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.
రైల్వే శాఖ పరిధిలోని మినీరత్న కంపెనీ అయిన రైట్స్ (ఆర్ఐటీఈఎస్)లో ఖాళీగా ఉన్న 170 ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 170 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు https://rites.com/ వెబ్‌సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 170
సివిల్ ఇంజినీర్- 50
ఎలక్ట్రికల్ ఇంజినీర్- 30
మెకానికల్ ఇంజినీర్- 90
ముఖ్య సమాచారం:
అర్హత: బీఈ లేదా బీటెక్ లేదా
బీఎస్సీలో సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్
అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెకానికల్ లేదా ప్రొడక్షన్
లేదా ఇండస్ట్రియల్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్ చేసి.. రెండేళ్ల అనుభవం తప్పనిసరిగా
ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష (60
శాతం), ఇంటర్వ్యూ (35 శాతం), అనుభవం (5 శాతం) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ,
ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300.
దరఖాస్తుకు చివరితేది: నవంబర్ 26, 2020
వెబ్‌సైట్: https://rites.com/
0 Komentar