RRB 2020: Exam Dates for Over 1600
Ministerial and Isolated Category Posts Announced
ఆర్ఆర్‌బీ 2020: రైల్వే పరీక్షల తేదీలు ఇవే..!
రైల్వే పరీక్షలకు డిసెంబర్ 15
నుంచి 23 మధ్య పరీక్షల్ని నిర్వహిస్తామని ఆర్ఆర్‌బీ
ప్రకటించింది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బీ) పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. రైల్వేలో మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు డిసెంబర్ 15 నుంచి 23 మధ్య పరీక్షల్ని నిర్వహిస్తామని తాజాగా ఆర్ఆర్‌బీ అధికారికంగా ప్రకటించింది. అయితే పెండింగ్‌లో ఉన్న నియామక పరీక్షల్ని డిసెంబర్ 15 నుంచి నిర్వహిస్తామని ఇప్పటికే ఆర్ఆర్‌బీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేందుకు అక్టోబర్ 15 నుంచి 20 వరకు లింక్ అందుబాటులో ఉంచింది. ఈ ప్రక్రియ పూర్తి కావడంతో ఎగ్జామ్ డేట్స్ ప్రకటించింది. ఈ పోస్టులకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రాఫీ స్కిల్ టెస్ట్, ట్రాన్స్‌లేషన్ టెస్ట్, ఫర్మామెన్స్ టెస్ట్, టీచింగ్ స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు ఎగ్జామ్ సిటీ, తేదీ వివరాలను పరీక్షకు 10 రోజుల ముందు తెలుసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ట్రావెల్ పాస్‌ను కూడా 10 రోజుల ముందు నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు విడుదల చేస్తారు.
ఆర్ఆర్‌బీ మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ నోటిఫికేషన్ ద్వారా 1663 జూనియర్ స్టెనోగ్రాఫర్-హిందీ, ఇంగ్లీష్, ట్రాన్స్లేటర్, కుక్, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, టీచర్, లా అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి గతేడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదలైంది. ఇక మినిస్టీరియల్, ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు మాత్రమే కాదు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పోస్టులకు కూడా డిసెంబర్ 15 నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరగనుంది. త్వరలో ఎన్టీపీసీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా వచ్చే అవకాశముంది.
ఇక రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు
చేసిన అభ్యర్థులు అప్‌డేట్ కోసం http://www.rrbcdg.gov.in/ లేదా
http://www.rrbsecunderabad.nic.in/ వెబ్‌సైట్ ఫాలో అవుతూ
ఉండాలి.
0 Komentar