Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Probationary Officers Recruitment - 2020

 


SBI Probationary Officers Recruitment - 2020

ఎస్‌బిఐ పి‌ఓ నియామకం

బ్యాంకు ఉద్యోగాలు కోరుకునేవారికి అతిపెద్ద శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 2000 ఖాళీలను ప్రకటించింది. మొత్తం 2000 ఖాళీల్లో 200 పోస్టుల్ని ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్‌కి కేటాయించింది ఎస్‌బీఐ. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఈరోజే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 4 చివరి తేదీ. ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ 31, జనవరి 2, 4, 5 తేదీల్లో ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు జాయిన్ అయ్యే సమయంలో రూ.2 లక్షల బాండ్ రాసి ఇవ్వాలి. బాండ్ ప్రకారం అభ్యర్థులు కనీసం మూడేళ్లు బ్యాంకుకు సేవలు అందించాలి.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు- 2000

ఎస్సీ- 300

ఎస్టీ- 150

ఓబీసీ- 540

ఎకనమికల్లీ వీకర్ సెక్షన్- 200 జనరల్- 810


SBI PO recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు 

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2020 నవంబర్ 14

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ- 2020 డిసెంబర్ 4

దరఖాస్తు ఫీజు చెల్లింపు- 2020 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 4

ప్రిలిమినరీ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్- 2020 డిసెంబర్ మూడోవారం

ఫేజ్ 1 ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్- 2020 డిసెంబర్ 31, 2021 జనవరి 2, 4, 5

ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల- 2021 జనవరి మూడో వారం

మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 జనవరి మూడో వారం

ఫేజ్ 2 ఆన్‌లైన్ మెయిన్ ఎఘ్జామ్- 2021 జనవరి 29

మెయిన్ ఫలితాల విడుదల- 2021 ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం

ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2021 ఫిబ్రవరి మూడోవారం లేదా నాలుగో వారం

ఫేజ్ 3 ఇంటర్వ్యూ లేదా గ్రూప్ ఎక్సర్‌సైజెస్- 2021 ఫిబ్రవరి లేదా మార్చి

తుది ఫలితాల విడుదల- 2021 మార్చి చివరి వారం

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీ అభ్యర్థులకు ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్- 2020 డిసెంబర్ రెండోవారం

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2020 డిసెంబర్ మూడోవారం లేదా నాలుగో వారం


SBI PO recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు 

విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. 2020 డిసెంబర్ 31 లోపు డిగ్రీ పాస్ కావాలి.

వయస్సు- 2020 ఏప్రిల్ 4 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

పరీక్షా కేంద్రాలు- తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి.

Online Registration of Application & Payment of Fees: From 14.11.2020 TO 04.12.2020

ADMIT CARD FOR PRELIMS OF SBI PO 

RECRUITMENT OF PROBATIONARY OFFICERS 

APPLY HERE

Previous
Next Post »
0 Komentar

Google Tags