Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Smart Health Card for Employees and Pensioners Health Card - Week deadline for changes

 


Smart Health Card for Employees and Pensioners Health Card - Week deadline for changes

ఉద్యోగులు, పెన్షనర్లకు ఇక స్మార్ట్ హెల్త్ కార్డ్ హెల్త్ కార్డు - మార్పులకు వారం గడువు

 

ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు క్యూఆర్‌ కోడ్‌తో కూడిన స్మార్ట్‌ ఆరోగ్య కార్డులను జారీ చేయనున్నామని  వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో మల్లికార్జున తెలిపారు. కోడ్ తో కూడిన ఈ స్మార్ట్ కార్డుల మార్పులు, చేర్పులు చేసుకోవాలంటే పోర్టల్ లో లాగిన్ అయి అప్డేట్ చేసుకోవాలని వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ సీఈవో మల్లికార్జున సూచించారు.

యూజర్ ఐడీ, పాస్వర్డ్ లతో లాగిన్ అయిన తర్వాత ఎడిట్ కార్డ్ డిటైల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందని. దీని సహాయంతో వివరాలను సరి చేసుకోవచ్చని తెలిపారు. హెల్త్ కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునేందుకు ఏడు రోజులు గడువు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మార్పులు, చేర్పులు చేసుకోవాలని కోరారు.. మరిన్ని వివరాల కోసం 104, 8333817469, 8333817406, 8333817414 చరవాణి నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags