SSC CHSL 2020 Notification Released Tier-I Exam from April 12
ఇంటర్ ఉత్తీర్ణతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుకు
త్వరపడండి..!
SSC CHSL 2020-21: ఎస్ఎస్‌సీ - సీహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2020 నోటిఫికేషన్ విడుదలైంది.
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ వంటి పోస్టుల భర్తీకి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్ఎస్‌ఎల్) నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
భర్తీ ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో (టైర్-1) ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, రెండో దశ (టైర్-2)లో పెన్‌పేపర్ (వ్యాసరూప ప్రశ్నలు) పరీక్ష, మూడో దశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే మొత్తం పోస్టుల సంఖ్యను వెల్లడించలేదు. కాగా.. గతేడాది 4,893 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో పోస్టులు ఉండే అవకాశం ఉందని సమాచారం.
పోస్టులు:
1) లోయర్ డివిజన్ క్లర్క్
(ఎల్‌డీసీ)/ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
2) పోస్టల్ అసిస్టెంట్/
సార్టింగ్ అసిస్టెంట్
3) డేటా ఎంట్రీ ఆపరేటర్
ముఖ్య సమాచారం:
అర్హత: ఎల్డీసీ, జేఎస్ఏ,
పీఏ, ఎస్ఏ, డీఈఓ పోస్టులకు
ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. కాగ్ ఆఫీస్‌లో డీఈఓలకు ఎంపీసీతో ఇంటర్ ఉత్తీర్ణులు
కావాలి.
వయసు: 18
నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, టైపింగ్
లేదా స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్
15,
2020
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు
చివరితేదీ: డిసెంబర్ 17, 2020
టైర్-1
పరీక్ష: 2021, ఏప్రిల్ 12 నుంచి 27 వరకు
వెబ్‌సైట్: https://ssc.nic.in/
పరీక్ష విధానం:
టైర్-1: కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్,
జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్టులో
25 ప్రశ్నల చొప్పున 50 మార్కులకు
ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. గంటలో పరీక్ష
రాయాలి.
టైర్-2: వ్యాసరూప ప్రశ్నలు. ఇందులో ఎస్సే రైటింగ్ (200
నుంచి 250 పదాల్లో రాయాలి), లెటర్
రైంటింగ్ ఉంటాయి. మొత్తం 100 మార్కులు.
టైర్-3: స్కిల్ టెస్ట్. హిందీ, ఇంగ్లిష్‌లో టైపింగ్ పరీక్ష
ఉంటుంది.
0 Komentar