Teacher's Union Protests Called Off
ఉపాధ్యాయ సంఘాల నిరసన కార్యక్రమాల విరమణ
ఉపాధ్యాయుల బదిలీ ఉత్తర్వులలో
అవసరమైన మార్పుల కోసం ప్రత్యక్ష కార్యాచరణ నోటీసు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ
సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. రాష్ట్ర సచివాలయంలో
విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్, ఆ శాఖ కమిషనర్
చినవీరభద్రుడుతో బుధవారం జరిగిన సమావేశంలో ఫ్యాప్టో నేతలు పలు విషయాలను విన్నవించుకున్నారు.
ప్రధానంగా ఎస్టీటీల బదిలీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని లేనిపక్షంలో
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ తరహాలో చేపట్టాలని సూచించారు. సర్వీస్ పాయింట్లపై సీలింగ్
తొలగించాలని కోరారు. కొన్నిటిని పరిశీలిస్తామని, మరికొన్నింటిని
వారు కోరిన విధంగా అమలు చేసేందుకు చర్యలు చేపడతామని మంత్రితో పాటు అధికారులు హామీ
ఇవ్వడంతో ఈ నెల 21న అన్ని జిల్లాల్లో తలపెట్టిన పికెటింగ్
కార్యక్రమాలను విరమించుకున్నట్టు ఫ్యాప్టో నాయకులు ప్రకటించారు. తమ డిమాండ్లపై
సానుకూలంగా స్పందించినందుకు సురేష్ కు ధన్యవాదాలు తెలిపారు.
0 Komentar