Telangana High Court Key Orders on
Diwali Festival 2020
దీపావళి క్రాకర్స్ బ్యాన్..
ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలన్న హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.
దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో న్యాయవాది ఇంద్రప్రకాష్ పీల్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతారని పిటిషనర్ తన పిల్ లో పేర్కొన్నాడు. క్రాకర్స్ వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు పడుతారని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. పిటీషనర్ వాదనలను హై కోర్ట్ పరిగణనలోకి తీసుకుంది.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలన్న హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బ్యాన్ చేసిందని హైకోర్టు పేర్కొంది. అంతేకాకుండా కలకత్తాలో కూడా బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచ్చిందని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ లో కూడా క్రాకర్స్ బ్యాన్ చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
అంతేకాకుండా ఎవ్వరు క్రాకర్స్
అమ్మడం గాని , కొనడం గాని చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది. ఎవరైనా
అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19 న
ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ప్రచార
మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని
హైకోర్టు ఆదేశించింది.
0 Komentar