Telangana Inter Board Key Decision Grace
Marks to Absentees
టీఎస్ ఇంటర్ బోర్డు కీలక
నిర్ణయం.. వాళ్లందరూ పాస్
కోవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది ఇంటర్ విద్యార్థులను గ్రేస్ మార్కులతో పాస్ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరుకాని వారు 27,251 ఉండగా.. మాల్‌ప్రాక్టీసు స్క్రూటినీ కమిటీ బహిష్కరించిన 338 మంది ఉన్నారు. కోవిడ్-19 ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అందరినీ పాస్ చేసినట్లయింది.
ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా
శిక్షణ:
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో
చదువుతూ.. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి ఉచితంగా
శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ద్వితీయ
సంవత్సరం చదివే విద్యార్థులకు ఇంటర్ విద్యాబోధనతో పోలీసు ఉద్యోగ నియామక పరీక్షకు
అవసరమైన అంశాల్లో కోచింగ్ ఇవ్వనున్నారు. పోలీసుశాఖతో ఇంటర్ బోర్డు ఈ మేరకు అవగాహన
ఒప్పందం కుదుర్చుకుంది.
0 Komentar