The First Installment of the Pending Salary
will be paid on December 1
పెండింగ్ వేతనంలో మొదటి విడత చెల్లింపు డిసెంబరు 1న
ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఉద్యోగులు, పింఛనుదారులకు
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో నిలిపివేసిన 50% జీతంలో మొదటి
విడత మొత్తాన్ని డిసెంబరు 1వ తేదీన విడుదలయ్యే జీతంతో పాటు ప్రభుత్వం జమ
చేయనున్నట్లు ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ
మేరకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చినట్లు శుక్రవారం ఒక
ప్రకటనలో తెలిపారు. పింఛనుదారులకు సంబంధించి మూడు పెండింగ్ డీఏల చెల్లింపు
షెడ్యూల్‌కు సీఎం జగన్ ఆమోదం తెలిపిన వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తామని
ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ స్పష్టం చేశారన్నారు.
0 Komentar