There will be no engineering syllabus cut - JNTU decision
ఇంజనీరింగ్ సిలబస్ కుదింపు ఉండదు –
జేఎన్‌టియూ నిర్ణయం
జేఎన్‌టీయూ నిర్ణయం. మొదటి ఏడాది తరగతుల ప్రారంభానికి కసరత్తు
ఇంజినీరింగ్ లో 2020-21 సంవత్సరానికి సిలబస్ తగ్గించకూడదని జేఎన్‌టీయూ నిర్ణయించింది. మొదటి ఏడాది తరగతులు ఆలస్యమైన కారణంగా సిలబస్ కుదించి సెమిస్టర్లు నిర్వహిస్తారన్న చర్చ నడుస్తోంది. దీంతో విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని భావించి, సిలబస్ కుదించకుండా పూర్తిస్థాయిలో బోధిస్తూనే విద్యా సంవత్సరం పూర్తి చేయాలని జేఎన్‌టీయూ భావిస్తోంది. వేసవి. ఇతర సెలవులు తగ్గించుకుంటూ విద్యా సంవత్సరం నిర్వహించనుంది. పరీక్షల్లో ఇచ్చికాలు సెమిస్టర్ పరీక్షల పరుగా వెసులుబాటు - కల్పించే అవకాశం ఉంది. ఇంజినీరింగ్ విద్యా సంవత్సరాన్ని డిసెంబరు. ఒకటి నుంచి ప్రారంభించాలని ఏఐసిటిఈ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీనికి తగ్గట్టుగా జేఎన్‌టీయూ అధికారులు మొదటి ఏడాది తరగతులు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యా సంస్థలు పునఃప్రారంభించే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకపోవడంతో తొలుత ఆన్లైన్లో తరగతులు జరగనున్నాయి. ఇప్పటికే రెండు, మూడు, నాలుగు సంవత్సరాలకు సంబంధించి ఆన్‌లైన్లో బోధన నడుస్తోంది. మొదటి ఏడాది తరగతులు ఈ నెలాఖరు లేదా డిసెంబరు ఒకటి నుంచి ప్రారంభం కానున్నాయి.
10 గ్రేస్ మార్కులు
బిటెక్, బిపార్మసీ
2019-20 సంవత్సరం నాలుగో ఏడాది రెండో సెమిస్టర్(4-2) ఫలితాలను జేఎన్‌టీయూ
ప్రకటించింది. బిటెక్ లో 63.4 శాతం మంది ఉత్తీర్ణత
సాధించగా బీఫార్మసీలో 47.8 శాతం మంది ఉత్తీర్ణుల య్యారు. ఈసారి గ్రెస్ మార్కుల కింద
పది మార్కులు కలపాలని ఎన్‌టీయూ నిర్ణయించింది.
0 Komentar