TS Covid-19 Media Bulletin 16-11-2020
తెలంగాణలో మరింత తగ్గిన కరోనా
కేసులు
అత్యధికంగా జీహెచ్ఎంసీలోనే 141 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు గత కొన్నిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో తెలంగాణ ప్రజలకు ఊరట లభించింది.
తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గాయి. నిన్న 600 దాటిన పాజిటివ్ కేసులు.. ఇవాళ ఐదువందలే నమోదు అయ్యాయి. గడిచిన గత 24 గంటల్లో రాష్టవ్యాప్తంగా 17,296 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 2,57,876కి చేరాయి. నిన్న ఒక్కరోజే 1,539 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ముగ్గురు మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1407కు చేరింది.
ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,42,084కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,385 యాక్టివ్‌లు ఉన్నాయి. ఇక ఐసోలేషన్‌లో 11,948 మంది ఉన్నారు. ఎప్పటిలోగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 141 కేసులు వచ్చాయి. తెలంగాణలో గత రెండు రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తుండటంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది. ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. దేశంలో మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. రాష్ట్రంలో రికవరీ రేటు 93.87 శాతం... దేశంలో రికవరీ రేటు 93.2 శాతంగా ఉంది.
0 Komentar