Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Inter Exams at the end of April - 10th class Annual Exams will be held in May

 


TS: Inter Exams at the end of April - 10th class Annual Exams will be held in May

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరున - మేలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణ

ఇంటర్ మీడియట్ చివరి పరీక్షలను ఏప్రిల్ నెలాఖరున, పదో తర గతి పరీక్షలను మే నెలలోను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ చంద్రన్ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమా చారం. ఏప్రిల్ నెలాఖరులో పదో తరగతి పరీక్షలు మొదలైతే అవి పూర్తయ్యేందుకు 15 రోజులు పడుతుంది. హిందీ తప్ప మిగిలిన సబ్జెక్టులలో రెండేసి పేపర్లుంటాయి, అంటే అవి మే 10 నాటికి పూర్తవుతాయి. ఆ వెంటనే ఇంటర్ పరీక్షలు ప్రారంభిస్తారు. ఇంతకు ముందు ఇంటర్ బోర్డు ప్రకటించిన విద్యాక్యాలెండర్ ప్రకారం మార్చి 24 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కావాలి. తాజాగా వాటిని మే నెలలో ఆరంభించచాలని చిత్రారామచంద్రన్ ఆదేశించినట్లు తెలిసింది. డిసెంబరు 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెలిస్తే అయిదు నెలలపాటు విద్యార్థులకు తరగతి గది బోధన అందుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశం.

పది విద్యార్థులకు వెసులుబాటు

ఇంటర్ ప్రశ్నపత్రాల విధానంలో మార్పులు చేయరాదని విద్యాశాఖ నిర్ణయించింది. పదో తరగతి విద్యార్థులకు ప్రశ్నపత్రాల్లో ఇప్పటివరకు ఉన్న దాని కంటే ఐచ్చికాలు చాయిస్) పెంచనున్నారు. పదో తరగతిలో ఒక్కో పేపరకు మొత్తం 40 మార్కులతో పరీక్ష నిర్వహిస్తారు. ఉదాహర -ఐకు ఇప్పటివరకు సాంఘిక శాస్త్రం పేపర్-1లోని పార్టీ-ఏ 35 మార్కులకు, పార్ట్-బి మరో 5 మార్కులకు పరీక్ష జరుపుతున్నారు. సెక్షన్-1లో ఏడు, సెక్షన్-2లో ఆరు ప్రశ్నలిస్తే అన్నింటికీ సమాధానాలు ఇవ్వాలి. సెక్షన్ లో మాత్రం నాలుగు మార్కుల ప్రశ్నలు 4 రాయాలి..

Previous
Next Post »
0 Komentar

Google Tags