పీజీ ఇంజినీరింగ్‌కు తగ్గిన గేట్, జీప్యాట్ ర్యాంకర్లు - ఈ సారి అందింది 1,404 దరఖాస్తులే
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఈ సారి ఎంటెక్‌లో చేరేందుకు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(గేట్), ఎంఫార్మసీలో ప్రవేశం పొందేందుకు గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్(జీప్యాట్) ర్యాంకర్లు భారీగా తగ్గిపోయారు. ఈ పీజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరడానికి మూడు నెలలపాటు దరఖాస్తుకు అవకాశం ఇవ్వగా.. కేవలం 1,404 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో జీప్యాట్ ర్యాంకర్లు 270 మందే ఉన్నారు. ఇటీవలనే దరఖాస్తుకు గడువు ముగిసింది. గత నాలుగేళ్లతో పోల్చితే 500 మందికి పైగా దరఖాస్తుదారులు తగ్గడం అధికారులనూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రాంగణ నియామకాలు తగ్గుతాయని, దూర ప్రాంతాల్లో చేరడం కంటే సొంత రాష్ట్రంలో చదివేందుకే ఆసక్తి చూపుతారని, దానివల్ల ఈసారి రెట్టింపు సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేస్తారని అధికారులు మొదట్లో అంచనా వేశారు. ‘అసలు గేట్‌లో ఉత్తీర్ణులైన వారు తగ్గారా? లేకుంటే ఆ ర్యాంకులతో ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో చేరాలనుకుంటున్నారా? అన్న అంశం తెలియడంలేదని పీజీఈసెట్ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య రమేష్‌బాబు అభిప్రాయపడ్డారు. గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు ఏఐసీటీఈ నుంచి నెలకు రూ.12,400 చొప్పున ఉపకార వేతనం అందుతుంది.
సంవత్సరాల వారీగా దరఖాస్తు చేసిన
గేట్,
జీప్యాట్ ర్యాంకర్లు
సంవత్సరం దరఖాస్తుదారులు
2016 1,996
2017 2,004
2018 1,880
2019 1,928
2020 1,404
0 Komentar