TTWREIS Offers NEET 2021 Free Long-Term
Coaching
నీట్-2021కు ఉచిత లాంగ్‌టర్మ్ శిక్షణ.. దరఖాస్తు గడువు పొడిగింపు
NEET 2021 ప్రవేశ పరీక్షకు ఉచితంగా లాంగ్‌టర్మ్ శిక్షణ ఇస్తున్నట్లు టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ వెల్లడించింది.
గిరిజన విద్యార్థులకు నీట్-2021 ప్రవేశ పరీక్షకు ఉచితంగా లాంగ్‌టర్మ్ శిక్షణ ఇస్తున్నట్లు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) వెల్లడించింది.
నీట్-2020లో 300 కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ శిక్షణకు అర్హులని తెలిపింది. రాజేంద్రనగర్‌లోని ఐఐటీ స్టడీ సెంటర్‌లో ఇచ్చే లాంగ్‌టర్మ్ కోచింగ్ పట్ల ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 6వ తేదీలోగా గిరిజన గురుకుల సొసైటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
ఆన్‌లైన్ దరఖాస్తు కొరకు http://www.tgtwgurukulam.telangana.gov.in/ వెబ్‌సైట్‌ని సందర్శించాలని గిరిజన గురుకుల సొసైటీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
300 పైగా మార్కులు ఉండాలి:
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
గిరిజన గురుకుల సొసైటీ పరిధిలోని
రాజేంద్రనగర్ ఐఐటీ స్టడీ కేంద్రంలో నీట్ లాంగ్‌టర్మ్ శిక్షణ కోసం దరఖాస్తు
గడువును నవంబరు 6 వరకు పొడిగించినట్లు ఎస్టీ గురుకుల సొసైటీ
కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నీట్-2020లో
300కు పైగా మార్కులు పొందిన గిరిజన అభ్యర్థులు దరఖాస్తు
చేసేందుకు అర్హులని పేర్కొన్నారు.
0 Komentar