Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC CDS (I) 2021 - Here Is The Selection Process And Preparation Tips

 


UPSC CDS (I) 2021 - Here Is The Selection Process And Preparation Tips

డిఫెన్స్‌లో 345 జాబ్స్‌.. అర్హత, ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ టిప్స్‌..!

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ ద్వారా 345 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఏడాదికి రెండు సార్లు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS) ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుందన్న సంగతి తెలిసిందే. 2021 ఏడాదికి సంబంధించి మొదటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS-1) ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్ ద్వారా 345 పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా త్రివిధ దళాలైన.. ఎయిర్‌ఫోర్స్, నేవీ, మిలిటరీ ఫోర్స్‌లో పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. 

ఈ ఉద్యోగాల్లో చేరడం ద్వారా భారత త్రివిధ దళాల్లో చేరి చిన్న వయసులోనే దేశ సేవలో భాగస్వాములు కావొచ్చు. డిగ్రీ పూర్తి చేసిన పాతికేళ్ల లోపు యువతకు ఈ పరీక్ష వరంలాంటిది. ఎంపికైతే గౌరవం, హోదా, మంచి జీతం లభిస్తాయి. 

మొత్తం ఖాళీలు: 345

ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్- 100

ఇండియన్ నేవెల్ అకాడమీ, ఎజిమళ - 26

ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్- 32

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై(ఎస్ఎస్సీ మెన్ నాన్ టెక్నికల్)- 170

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై (ఎస్ఎస్సీ విమెన్ నాన్ టెక్నికల్)- 17 

ముఖ్య సమాచారం:

అర్హతలు: అభ్యర్థులకు 25 సంవత్సరాల లోపు వయసుతో పాటు అవివాహితులై ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. నోటిఫికేషన్‌లో ఉన్న తేదీలను క్షుణ్నంగా చదవాలి.

దరఖాస్తు విధానం: https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేది: నవంబరు 17, 2020 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష ఫీజు: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు చెల్లించాల్సిన అవసరం లేదు)

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం. 

ఎంపిక విధానం:

సీడీఎస్ఈ ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. స్టేజ్‌-1లో రాత పరీక్ష.. స్టేజ్‌-2లో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

రాత పరీక్షలో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

ఒక్కో పేపర్‌కు 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.

పరీక్ష కాలవ్యవధి: మూడు విభాగాలకు రెండు గంటల చొప్పున సమయం కేటాయించారు.  

యూపీఎస్సీ

గమనిక:

ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్ ప్రశ్నపత్రం లేదు. అన్ని విభాగాల్లోని ప్రశ్నలకు మల్టిపుల్‌ ఛాయిస్‌ రూపంలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది. జవాబు తప్పుగా రాస్తే నేగిటివ్‌ మార్కులు ఉంటాయి. ఇంగ్లిష్ విభాగం మినహా మిగిలిన ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మీడియంల్లో ఇస్తారు. 

సిలబస్:

ఇంగ్లిష్: సదరు అభ్యర్థి ఇంగ్లిష్‌ను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారో పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ నాలెడ్జ్: వర్తమాన అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్ర అంశాలపై అభ్యర్థి అవగాహనను పరీక్షిస్తారు. ఎక్కువ ప్రశ్నలు దైనందిన జీవితానికి, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్‌కు సంబంధించనవి ఉంటాయి.

ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్: ఇందులో అడిగే ప్రశ్నలు పదో తరగతి స్థాయిలోనే ఉంటాయి. అర్థమెటిక్‌, బీజగణితం, జ్యామితి, త్రికోణమితి, క్షేత్రగణితం, స్టాటిస్టిక్స్ టాపిక్‌ల నుంచి ప్రశ్నలు ఉంటాయి. 

ఇంటర్వ్యూ:

ఈ రాత పరీక్షలో ఎంపికైతే ఇంటర్వ్యూకు అర్హత లభిస్తుంది. ఇందులో ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ మిగిలిన ఇంటర్వ్యూలతో పోలిస్తే కఠినతరమైనదనే చెప్పవచ్చు. ఇది అయిదు రోజులపాటు జరుగుతుంది. ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్ట్‌లు, సైకలాజికల్ పరిశీలనల ద్వారా అభ్యర్థుల తీరును క్షుణ్ణంగా సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షిస్తుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు బెంగళూరు కేంద్రంలో ఇవి జరుగుతాయి. ఇందులో ఎంపికైతే వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. ఎంపికైన వారు ఆర్మీలో చేరితే లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెప్టినెంట్, ఎయిర్‌ ఫోర్స్‌ ఫ్లయింగ్ ఆఫీసర్ హోదాలు పొందొచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags