Visakhapatnam Co-Operative Bank PO
Recruitment 2020
వైజాగ్‌లో బ్యాంక్ జాబ్స్..
ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వీసీబీఎల్ నోటిఫికేషన్
VCBL PO Recruitment 2020: విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ 30 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విశాఖపట్నంలోని మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు అయిన ది విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్ (వీబీఐఎల్) 30 ప్రొబేషనరీ ఆఫీసర్ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 10వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈనెల 30 దరఖాస్తుకు చివరితేది.
అభ్యర్థులు పూర్తి వివరాలకు https://vcbl.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీలు: 30
అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో
పాటు ఇంగ్లిష్, తెలుగు మాట్లాడడం, చదవడం,
రాయటంలో ప్రొఫిషియన్సీ, కంప్యూటర్ నాలెడ్జ్
సైతం ఉండాలి.
వయసు: 31.12.2020 నాటికి 20-30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.900
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/
ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేది: 2021 జనవరి నెలలో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్
10,
2020.
దరఖాస్తుకు చివరి తేది: నవంబర్
30,
2020.
వెబ్‌సైట్: https://vcbl.in/
0 Komentar