WhatsApp Payment Option Enabled
వాట్సాప్ పేమెంట్స్..మొదలయ్యాయి
ఇకపై యూపీఐ ట్రాన్సాక్షన్స్
చేసుకోవాలంటే వేరే యాప్ లను ఆశ్రయించకుండా వాట్సాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఆన్
లైన్ చెల్లింపుల రంగంలోకి వాట్సాప్ దిగేసింది. చాలా ఏళ్లుగా ఎదురుచూసిన వాట్సాప్
సంస్థ ఎట్టకేలకు అనుకున్నది సాధించింది. ఇన్ని రోజులు భారత మార్కెట్ లోకి
ప్రవేశానికి అడ్డంగా ఉన్న అవరోధాలను వాట్సాప్ అధిగమించింది. చట్టపరమైన అడ్డంకులు, కీలక
అనుమతులు లభించేసరికి చాలా సమయమే తీసుకుంది.
భారత జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్
వాట్సాప్ కు తాజాగా అనుమతులు మంజూరు చేసింది.
ప్రస్తుతానికి రెండు కోట్ల మంది వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఈ సేవలు
అందించాలని భారత జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ వాట్సాప్ ను ఆదేశించింది. భారత
బ్యాంకుల్లో ఖాతాలు ఉండి, మనదేశ ఫోన్ నెంబర్లు వినియోగిస్తున్న
వారికే ఈ వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అంతర్జాతీయ ఫోన్
నెంబర్లతో వాట్సాప్ ఉపయోగిస్తున్నవారికి ఈ ఫీచర్ అందుబాటులో ఉండదు.
వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ను
ఉపయోగించుకోవాలనుకునే వారు మొదట తమ బ్యాంక్ ఖాతాతో లింకైన ఫోన్ నెంబరు ద్వారా
రిజిస్టర్ అవ్వాలి. బ్యాంక్ అకౌంట్ తో లింకైన నెంబరు, వాట్సాప్
నెంబరు ఒకటే అయ్యుండాలి. వాట్సాప్ సెట్టింగ్స్ లో ఉన్న పేమెంట్స్ ఆప్షన్ మీద
క్లిక్ చేస్తే బ్యాంకుల జాబితా కనిపిస్తుంది. నగదు పంపాల్సిన బ్యాంకును ఎంపిక
చేసుకోగానే ఎస్సెమ్మెస్ తో అథెంటికేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత యూపీఐ పాస్
కోడ్ సెట్ చేసుకోవాలి. ఇంతకు ముందు యూపీఐ పాస్ కోడ్ ఉపయోగిస్తుంటే ఆ పాస్ కోడ్
వాట్సాప్ పేమెంట్స్ కు వాడాలి.
ఇతర యూపీఐ ఆధారిత యాప్ ల తరహాలోనే దీనికి వ్యాలెట్ లో నగదు నిల్వ చేసుకోవాల్సిన పనిలేదు. యూపీఐ సాయంతో నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు చేయొచ్చు. దీంట్లో మరో సదుపాయం కూడా ఉంది. వాట్సాప్ పేమెంట్స్ నుంచి ఇతర పేమెంట్స్ యాప్ లకు కూడా నగదు బదిలీ చేయొచ్చు. వాట్సాప్ పేమెంట్స్ లో రిజిస్టర్ కాకపోయినా వారి భీమ్, ఫోన్ పే, గూగుల్ పే యూపీఐ ఐడీ సాయంతో లావాదేవీలు జరపొచ్చు. యూపీఐ ఐడీ లేకపోతే, వాట్సాప్ పేమెంట్స్ లో రిజిస్టరై పాస్ కోడ్ పొందవచ్చు. వాట్సాప్ పేమెంట్స్ లో నగదు బదిలీ పరిమితిని రూ.1 లక్షగా నిర్ణయించారు.
0 Komentar