Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

2020 Is Not A Worst Year, Here Are Good And Amazing Things Happened In India

 

2020 Is Not A Worst Year, Here Are Good And Amazing Things Happened In India

2020 చెడ్డ సంవత్సరం ఎంతమాత్రం కాదు.. ఎంత మంచి జరిగిందంటే!

కాలచక్రంలో ఓ ఏడాది గిర్రున తిరిగింది. కొత్త సంవత్సరం వచ్చేసింది. కొత్త ఏడాదిలోనే కాదు, కొత్త దశాబ్దంలో అడుగుపెడుతున్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. గడిచిన ఏడాది పేరు చెబితే ఎక్కువ మంది ఏం గుర్తు చేసుకుంటారు? కరోనా వైరస్, లాక్‌డౌన్, మాస్క్, ఫిజికల్ డిస్టాన్స్.. ఇంతే అంటారు. వరెస్ట్ ఇయర్ అని తిట్టుకుంటారు కూడా. కానీ, ఇంతే జరిగిందా? 2020 మనకు ఏం నేర్పలేదా..? నేర్పింది.. ఎన్నడూ లేనంత సంతోషాన్ని ఇచ్చింది. 

మనిషికి క్రమశిక్షణ నేర్పింది. పరిశుభ్రత నేర్పింది. సమాజంతో సంబంధాలు కొనసాగిస్తూనే భౌతిక దూరం పాటించాలని చెప్పింది. అంటువ్యాధుల గురించి, రోగనిరోధక శక్తి గురించి, మనం తినే తిండి గురించి కొత్త పాఠాలు నేర్పింది. 

కుటుంబసభ్యులతో ఆనందంగా గడపటానికి కావాల్సినంత సమయాన్నిచ్చింది. పుట్టి పెరిగిన ఊరులో జీవితంలో ఎన్నడూ లేనంత ఎక్కువ కాలం ఉండే అవకాశం ఇచ్చింది. 

పర్యావరణాన్ని కాపాడితేనే మనిషి మనుగడ సాధ్యమని చెప్పింది. మనుషులందరూ క్రమశిక్షణతో ఉంటే.. ఈ ప్రకృతి ఎంత సుందరంగా, రమణీయంగా, ఆరోగ్యకరంగా ఉంటుందో చెప్పింది. కాలుష్య కాసారమైన గంగానది సైతం స్వచ్ఛమైన నీటితో పరవశిస్తుందని తెలిపింది. 

మనిషికి పోరాడే శక్తిని నేర్పింది. ఈజీ మనీకి అలవాటు పడ్డ వ్యక్తులకు చెమటోడ్చి కష్టపడితేనే సుఖమని చెప్పింది. విధి ఉన్నపలంగా రోడ్డున పడేస్తే.. బతకడానికి కొత్త దారులు చూపింది. అన్నింటికంటే మించి నీకు నిజమైన మిత్రులెవరో, శత్రువులెవరో తేల్చి చెప్పింది. 

భారత్ ఒక దేశం మాత్రమే కాదని.. అదొక జీవన విధానమని ప్రపంచానికి చాటిచెప్పింది. మన జీవనవిధానం, మన ఆచారాలు, మన యోగా, ధ్యానం గొప్పదనాన్ని తెలిపింది. భారతీయుల శక్తి వాళ్లు పడే కష్టంలో, తీసుకునే ఆహారంలోనే ఉందని ప్రపంచ దేశాలకు చెప్పింది. 

ప్రపంచానికంతటికీ ఒకేసారి జబ్బు చేసినా.. భారత్ ఔషధాలను అందించి కోలుకునేలా చేయగలదని చాటిచెప్పింది. 

శత్రువులు మారణాయుధాలతో దాడికి తెగబడినా.. మన సైనికులు వట్టి పిడికిళ్లతోనే మట్టి కరిపించగలరని ప్రపంచానికి చాటిచెప్పింది. దేశం కోసం మన జవాన్ ఎంతటి త్యాగానికైనా తెగిస్తాడని గల్వాన్ ఘటన నిరూపించింది. ఇండియన్ జవాన్ శక్తి ఏమిటో, రక్షణ పరంగా భారత్ ఎంత బలమైందో ప్రపంచానికి తెలిసేలా చేసింది. కుట్రలతో భారత్‌ను దెబ్బ తీయాలని చూస్తే.. రెట్టించిన శక్తితో పైకి లేస్తుందని శత్రు దేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది. 

ఇంటి నుంచి పని చేస్తూ కూడా అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది. కొన్ని రంగాలకు కొత్త దారులను చూపింది. 

కాలం నేర్పిన పాఠాలతో ముందుకు సాగాలి. ఆలస్యమైనా సరే మంచే జరుగుతుందనే ఆశతో అడుగువేయాలి. ఆత్మవిశ్వాసంతో దూసుకుపోవాలి. అదే జీవితం. మన ప్రయత్నాల్లో ఎలాంటి లోపం ఉండకూడదు. అప్పుడే విజయం వరిస్తుంది. కొత్త సంవత్సరం మరింత ఎక్కువ ఆనందాన్నిస్తుంది.. 

మీకు, మీ కుటుంబసభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు..

Previous
Next Post »
0 Komentar

Google Tags