అమ్మఒడి ద్వారా అనర్హులు లబ్ధిపొందితే చర్యలు -పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు
ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలు
అమ్మఒడి పథకం కింద లబ్ధి పొందినట్లు తెలితే, ఆ ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తామని
పాఠశాల విద్యాశాఖ సంచాలకులు ఆదేశాలు జారీ చేశారు. ఓ జిల్లాలో తప్పుడు వివరాలను
నమోదు చేసి అమ్మఒడి లబ్ధి పొందిన ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులను సస్పెండ్
చేసినట్లు పేర్కొన్నారు. అనర్హులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ,
ప్రైవేటు, పొరుగుసేవలు, ఒప్పంద
ఉద్యోగులు లబ్ధిపొందినట్లు తెలితే క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
0 Komentar