All India Bar exam schedule released,
registration begins from Dec 26, exam on March 21
మార్చి 21న
ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్
న్యాయవాదిగా ప్రాక్టీసు చేయడానికి అర్హతను నిర్ణయించే ఆల్ ఇండియా ‘బార్ ఎగ్జామ్-16’ను మార్చి 21న నిర్వహించాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 26న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగుస్తుందని సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి 23 వరకు, ఆన్‌లైన్ దరఖాస్తు పూర్తిచేయడానికి ఫిబ్రవరి 26 వరకు గడువు ఉంటుందని తెలిపింది. మార్చి 6 నుంచి అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది.. రెండు నెలల వ్యవధిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండు పరీక్షలు నిర్వహించనుంది. ఇదివరకే ప్రకటించినట్లుగా ఆల్‌ఇండియా బార్ ఎగ్జామ్-15 జనవరి 24న జరుగుతుందని, దాని తేదీల్లో ఎలాంటి మార్పూ లేదని స్పష్టంచేసింది. దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డిసెంబర్ 19తో ముగిసినట్లు తెలిపింది. ఇప్పటివరకు ఈ పరీక్ష కోసం లక్ష మందికిపైగా విద్యార్థులు తమ పేర్లు నమోదుచేసుకున్నారని, 50 నగరాల్లోని 140 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని వెల్లడించింది.
0 Komentar