All States to Begin Vaccine Dry Run from
January 2
2 నుంచి అన్నీ రాష్ట్రాల్లో
డ్రై రన్
కొవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి
దేశంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వ్యాక్సిన్ పంపిణీలో లోటుపాట్లు
తెలుసుకునేందుకు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ చేపట్టిన కేంద్ర
ప్రభుత్వం.. ఈ ప్రక్రియను అన్ని రాష్ట్రాల్లో నిర్వహించేందుకు సిద్ధమైంది. జనవరి 2 నుంచి
దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ
మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి సమావేశం
గురువారం జరిగింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించేందుకు
సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఏ సమయంలోనైనా
టీకాలకు అనుమతులు లభించే అవకాశం ఉండడంతో టీకా సంబంధిత యాప్ కోవిన్ పనితీరు,
సిబ్బంది వినియోగం, కోల్డ్ స్టోరేజీలో నిల్వ,
తరలింపు వంటి ప్రక్రియలో లోటుపాట్లు తెలుసుకునేందుకు డిసెంబర్ 28,
29 తేదీల్లో డ్రైరన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో
కృష్ణాజిల్లాతో పాటు పంజాబ్, అసోం, గుజరాత్
లో ఈ ప్రక్రియ చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియ విజయవంతం అయ్యిందని
కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త డైరకు సిద్ధమైంది. మరోవైపు ఎస్ఎఐ,
భారత్ బయోటెక్ సంస్థలు తమ టీకాల అత్యవసర వినియోగం కోసం చేసుకున్న
దరఖాస్తులను పరిశీలించడానికి నిపుణుల కమిటీ బుధవారం సమావేశమైంది. మరింత లోతుగా
చర్చించడానికి శుక్రవారం మరోసారి భేటీ కానుంది.
0 Komentar