అమ్మ ఒడి జాబితాలో పేరు లేని వారందరికీ
ప్రభుత్వం మరో అవకాశం
అమ్మ ఒడి పథకం అనర్హత జాబితాల్లోకి వెళ్లిన వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
ఏపీలో అమ్మ ఒడి పథకం అమలు విషయంలో ప్రభుత్వం కీలక సూచన చేసింది. 2021 జనవరి 9న రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే అర్హుల ఎంపిక దాదాపు పూర్తి చేసింది. దాదాపు 80లక్షల మంది విద్యార్థులకు రూ.15వేలు చొప్పున అందించనుంది. అయితే.. కొన్ని కారణాల వల్ల అర్హత ఉన్నవారు కూడా అనర్హత జాబితాల్లోకి వెళ్లారు. దీంతో ఇలాంటటి వారందరికీ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
అమ్మఒడి వర్తించని వారు అధికారుల చుట్టూ తిరగకుండా గ్రామ సచివాలయాల్లోనే సమస్యను పరిష్కరించుకునే ఏర్పాటు చేసింది. అమ్మఒడి జాబితా సవరణ కోసం గ్రామ సచివాలయాలకే లాగిన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. సచివాలయ సిబ్బందికి అనర్హుల జాబితాను సరివరించేందుకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగిందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ప్రభుత్వం విద్యార్థుల జాబితాను ఎంటర్ చేసే ప్రక్రియ చేపట్టింది. వీటిలో అర్హులు, అనర్హులు, నిలిపివేసిన దరఖాస్తుల జాబితాను వెబ్ సైట్ లో ఉంచింది. అనర్హులు, నిలిపేసిన దరఖాస్తుల జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లులు ఆందోళన చెందకుండా గ్రామ సచివాలయానికి వెళ్లి సంబంధిత డాక్యుమెంట్లు అందజేయాలని ప్రభుత్వం సూచించింది.
అమ్మఒడి పథకం అర్హతలు:
ఒక కుటుంబానికి మాగాణి 3
ఎకరాలకు మించిగానీ.. 10 ఎకరాలకు మించి మెట్ట భూమిగానీ.. లేదా
మొత్తం మీద 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో
నెలకు రూ.10,000, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 రూపాయలకు మించి ఉండకూడదు.
విద్యుత్ బిల్లు నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగించి ఉండరాదు. లేదా గత ఆరు నెలలకు సగటున
కరెంట్ బిల్లు 1800 యూనిట్లు వినియోగించి ఉండకూడదు.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్
దారుల పిల్లలకు అమ్మవడి వర్తించదు. పారిశుద్ధ్య కార్మికుల పిల్లకుకు ఈ నిబంధన
నుంచి మినహాయింపు ఉంటుంది.
కుటుంబంలో ఎవరి పేరుమీదైనా ఫోర్
వీలర్ ఉంటే అమ్మ ఒడి వర్తించదు. అయితే ట్రాక్టర్, టాక్సీ, ఆటోలకు ఈ నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు.
మున్సిపాలిటీల్లో 1000 చదరపు అడుగులు.. గ్రామాల్లో 1200 చదరపు అడుగుల కంటే
ఎక్కువ ఇంటిస్థలం ఉంటే వర్తించదు.
గతంలో ఆదాయపు పన్ను చెల్లించి ఉన్నవారు అనర్హులు.
ఈ ఏడాది పెరిగిన లబ్ధిదారులు:
రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు 72,74,674 మంది, 11, 12 తరగతులకు సంబంధించి 10,97,580 మంది విద్యార్థులు అమ్మ ఒడి పథకానికి ఎంపికయ్యారని మంత్రి సురేశ్ తెలిపారు. 61,317 పాఠశాలలు, 3,116 కాలేజీలకు చెందిన మొత్తం 83,72,254 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జనవరి 9వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు అమ్మ ఒడి నగదు జమవుతుందన్నారు. గతేడాది కంటే ఈ ఏడాది లబ్ధిపొందే విద్యార్థుల సంఖ్య పెరిగిందని వివరించారు.
వెబ్‌సైట్లు:
0 Komentar