ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు 18-12-2020
ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. రాష్ట్రంలో సమగ్ర భూసర్వేకు ఆమోదం సహా పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని వివరాలను మీడియాకు వెల్లడించారు. భూ సర్వే, సరిహద్దు చట్టంలో సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సబ్ డివిజన్ ప్రకారం మ్యాప్ తయారీ చేస్తామని.. అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూసర్వే జరుగుతుందని మంత్రి వివరించారు. మూడేళ్లలో భూసర్వే పూర్తి చేసి భూహక్కు పత్రాలను జారీ చేస్తామన్నారు. ల్యాండ్ రికార్డుల తయారీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. దీంతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లకు రీస్టార్ట్ ప్యాకేజీ ఇస్తున్నట్లు వివరించారు.
కేబినెట్ నిర్ణయాలివే..
* సమగ్ర భూసర్వే, సరిహద్దు చట్టంలో సవరణలకు ఆమోదం
* తిరుపతి వద్ద 40 ఎకరాల్లో సర్వే అకాడమీ ఏర్పాటు
* హోటళ్లు, రెస్టారెంట్లు, పర్యాటక ప్రాజెక్టులకు రీస్టార్ట్
ప్యాకేజీ.. రూ.50వేల నుంచి రూ.15లక్షల
వరకు రుణసదుపాయం. సినీ పరిశ్రమకూ రీస్టార్ట్ ప్యాకేజీ అమలు.
* కొత్త పర్యాటక విధానానికి
ఆమోదం.. పర్యాటక ప్రాజెక్టుల పెట్టబడులకు ప్రోత్సాహకాలు.
* రూ.400కోట్లకు మించి పెట్టబడులు పెడితే మెగా పరిశ్రమ హోదా. లీజు కాలాన్ని 33 నుంచి 99 ఏళ్లకు పెంపు.
* చింతలపూడి ఎత్తిపోతల
పథకానికి నాబార్డు నుంచి రూ.1,931 కోట్ల రుణం. రుణం
తీసుకునేందుకు జలవనరుల శాఖకు అనుమతి
* రాష్ట్ర అదనపు ఏజీగా
జాస్తి నాగభూషణం నియామకానికి ఆమోదం.
* ఏప్రిల్, మే, జూన్ కాలానికి పవర్ ఫిక్స్‌డ్ ఛార్జీల రద్దు.
ప్రస్తుత ఫిక్స్‌డ్ ఛార్జీలు వాయిదాల్లో చెల్లింపునకు ఆమోదం.
* 1100 సినిమా థియేటర్లకు
రుణాలు, వడ్డీపై రాయితీకి కేబినెట్ నిర్ణయం.
* పౌరసరఫరాల కార్పొరేషన్
ద్వారా రూ.5వేల కోట్ల రుణసమీకరణకు పచ్చజెండా
* వైద్యవిద్య పరిశోధన
కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
* రైతుభరోసా మూడో విడత
అమలుకు కేబినెట్ ఆమోదం. మూడో విడత కింద రూ.2వేల ఆర్థిక
సాయం. 54.47లక్షల మంది రైతులకు ప్రయోజనం. ఈనెల 29న రైతుల ఖాతాల్లో రూ.1,009కోట్ల జమ.
* ప్రకృతి వైపరీత్యాలతో
నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ. పెట్టుబడి రాయితీ నెలలోనే చెల్లించేలా కొత్త
విధానానికి ఆమోదం.
* నివర్ తుపానుతో 12లక్షల ఎకరాల్లో 8.6లక్షల మంది రైతులకు నష్టం. వారికి
పెట్టుబడి రాయితీ కింద రూ.719కోట్లు చెల్లింపు
* పశుసంవర్ధక శాఖలో 147 ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం
* పులివెందులలో ఏపీ రూరల్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కేంద్రం ఏర్పాటు
* ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం.
0 Komentar