AP Covid-19 Media Bulletin 13-12-2020
5 వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా యాక్టివ్
కేసులు ఐదు వేల దిగువకు చేరాయి. 24 గంటల వ్యవధిలో 63,873 నమూనాలను పరీక్షించగా 506 కరోనా పాజిటివ్ కేసులు..
ఐదు మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ
వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,75,531కి
చేరింది. కరోనాతో ఇప్పటి వరకు 7,057 మంది మృతి చెందారు. కరోనా నుంచి 8,63,508 మంది
కోలుకుని డిశ్చార్జి కాగా.. 4,966 మంది వివిధ ఆసుపత్రుల్లో
చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,08,30,990 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.
0 Komentar