AP Covid-19 Media Bulletin 17-12-2020
ఏపీలో మరో 534 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 534 మందికి కొవిడ్ నిర్ధారణ కాగా.. ఇద్దరు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,77,348కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్ బారినపడి 7,069 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 498 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,65,825కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,454 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,10,65,297 కరోనా సాంపుల్స్‌ని ఆరోగ్య శాఖ పరీక్షించింది.
0 Komentar