ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం - తొలిరోజు ఆప్షన్స్ నమోదు చేసుకున్న 21 వేల మంది హాజరు
ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం ఎంసెట్
కౌన్సెలింగ్ ప్రక్రియ సోమ వారం నుంచి ప్రారంభమైందని విద్యాశాఖ మంత్రి డా. ఆదిమూలపు
సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఒక్క రోజులో ఆప్షన్స్ నమోదు చేసుకున్న వారి వివరాలను
ఆయన వెల్లడించారు. రాష్ట్రం లో ఎంసెట్ ర్యాంకులు సాధించి, ఇంజినీరింగ్
ప్రవేశాలకు అర్హత సాధించిన వారి సంఖ్య లక్షా 29 వేల 633
మంది అన్నారు. వీరి కోసం రాష్ట్రవ్యాప్తం గా అన్ని జిల్లాల్లో కలిపి
25 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేసి పరిశీలన
జరుపుతున్నానమని తెలిపారు. అర్హత సాధించిన వారిలో తొలిరోజు 89 వేల 48 మందికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జరిగిందన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన తరువాత అర్హత పొందిన వారి సంఖ్య 87 వేల 496గా ఉందన్నారు. అలాగే 1 నుంచి
60 వేల ర్యాంక్ వరకు ఆప్షన్ ఎంట్రీ కొరకు పాస్వర్డ్ జెనరేట్
చేసుకున్న వారు 34 వేల 78 మంది
ఉన్నారన్నారు. మొత్తం ఆప్షన్స్ నమోదు చేసుకున్న వారి సంఖ్య 21 వేల 198 అని మంత్రి డా. సురేష్ వివరించారు.
0 Komentar