AP Inter Board Key Decision in Corona
Waived Off Some Fee for Inter Students
ఇంటర్ బోర్డు నిర్ణయం: కరోనా
కారణంగా ఈ ఏడాది అడ్మిషన్ సహా వివిధ రకాల ఫీజులు రద్దు
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా ఈ ఏడాది అడ్మిషన్ సహా వివిధ రకాల ఫీజులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రీ అడ్మిషన్లు, మీడియం లేదా గ్రూప్ మార్పులకు సంబంధించి వసూలు చేసే ఫీజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా అంశాలకు సంబంధించి ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాల్లో ఎవరి దగ్గర ఫీజులు వసూలు చేయవద్దని ఇంటర్ కాలేజీ ప్రిన్సిపాల్ లకు కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కరోనా కారణంగా ఈ ఏడాది ప్రభుత్వం అనేక రాయితీలు ప్రోత్సాహకాలు ఇస్తూ వస్తోంది అందులో భాగంగానే ఇంటర్ విద్యార్థులకు మరింత వెసులుబాటు కల్పించే విధంగా ఈ ఫీజులు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రీ అడ్మిషన్ తీసుకోవాలి అనుకున్నా లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్ , ఇంగ్లీష్ నుంచి తెలుగు మీడియం కి మారాలి అనుకున్నా, వేరే గ్రూపులో కి మారాలి అనుకున్నా ఎలాంటి ఫీజులు చెల్లించకుండానే ఆ అవకాశం పొందే ఛాన్స్ ఉంటుంది.
తగ్గించిన ఫీజు వివరాలు:
రీ అడ్మిషన్స్ (రూ.1000), టీసీ అడ్మిషన్స్ (రూ.1000), సెకండ్ లాంగ్వేజ్
మార్చుకునే ఫీజు (రూ.800, ఫస్ట్ ఇయర్ మాత్రమే), మీడియం మార్చుకోవడానికి ఫీజు (రూ.600, ఫస్ట్ ఇయర్
మాత్రమే), గ్రూప్ మార్చుకోవడానికి ఫీజు (రూ.1000, ఫస్ట్ ఇయర్ మాత్రమే), ఛేంజ్ ఆఫ్ గ్రూప్ (రూ.1000,
సెకండ్ ఇయర్ కోసం).. ఈ ఫీజులను తగ్గించింది.
0 Komentar