Application Process Begins for CMAT,
GPAT 2021
ఫిబ్రవరి 22, 27న జీప్యాట్, సీమ్యాట్
జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలైన
గ్రాడ్యుయేట్ ఫార్మసీ ఆప్టిట్యూడ్ టెస్ట్ (జీప్యాట్), కామన్
మేనేజ్ మెంట్ అడ్మిషన్ టెస్ట్ (సీమ్యాట్) వచ్చే ఫిబ్రవరి 22, 21వ తేదీల్లో ఆన్ లైన్ విధానంలో జరగనున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల
మండలి(ఎన్‌టీఏ) బుధవారం నోటిఫికేషన్లు జారీ చేసింది. జాతీయ ఫార్మసీ విద్య, పరిశోధనా సంస్థ(నైపర్)ల్లో ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి జీప్యాట్,
మేనేజ్ మెంట్ కళాశాలలు, సంస్థల్లో
ఎంబీఏ/పీజీడీఎం కోర్సుల్లో చేరేందుకు సీమ్యాట్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల సమర్పణకు జనవరి 22 తుది గడువుగా నిర్ణయించారు.
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Application Form Submission: 23-12-2020
to 22-01-2021
Application Form Fee Submission:
23-12-2020 to 23-01-2021
0 Komentar