అప్రెంటిస్‌షిప్ డిగ్రీలు - డిగ్రీ కోర్సుల్లో మార్పులపై యూజీసీ మార్గదర్శకాలు
తప్పనిసరి ఉత్తీర్ణత నిబంధన
బహుళ సబ్జెక్టులు చదివే అవకాశం
సాధారణ డిగ్రీల ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) అప్రెంటిస్‌షిప్‌తో పాటు బహుళ సబ్జెక్టులను చదివే విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్రెంటిస్‌షిప్‌లో ఉత్తీర్ణతను తప్పనిసరి చేసింది. ఒకవేళ అనుత్తీర్ణులైతే మళ్లీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. 2030నాటికి దేశ జనాభాలో పనిచేసే వయసు కలిగిన వారి సంఖ్య ఎక్కువగా ఉండనున్నందున ఉపాధి అవకాశాలను పెంచడంపై యూజీసీ దృష్టి సారించింది. సాధారణ డిగ్రీలతో ఉద్యోగావకాశాలు రావడం కష్టం కాబట్టి డిగ్రీ చదివే సమయంలోనే అప్రెంటిస్‌షిప్‌ను తీసుకొస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అభ్యాసన ఫలితాల ఆధారిత డిగ్రీ కోర్సులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతో ఉన్నత విద్యాసంస్థల అనుసంధానంపై దృష్టిసారించింది. దేశంలోని అన్ని విద్యాసంస్థలు దీన్ని పాటించాలని సూచించింది.
బహుళ సబ్జెక్టులతో డిగ్రీ
అప్రెంటిస్‌షిప్ డిగ్రీలో
విద్యార్థులు తాను చదివే డిగ్రీ కోర్సుతో పాటు ఇతర కోర్సుల్లోని కోర్ సబ్జెక్టులో
24 క్రెడిట్లు సాధిస్తే ఆయా సబ్జెక్టులో పీజీలు చేసుకోవచ్చు. ఉదాహరణకు బీబీఏ
లాజిస్టిక్స్ అప్రెంటిస్‌షిప్ విద్యార్థి కోర్ కోర్సు ఆర్థిక శాస్త్రంలో 24క్రెడిట్లు సాధిస్తే పీజీ ఎం.ఏ, ఎమ్మెస్సీ ఆర్థిక
శాస్త్రం చదివేందుకు అర్హత లభిస్తుంది. చదివే డిగ్రీతోపాటు ఇతర కోర్ కోర్సులో ఒక
సబ్జెక్టు చదవడం ద్వారా నచ్చిన కోర్సులో పీజీ చేసుకోవచ్చు.
0 Komentar