అంబేడ్కర్ డిగ్రీ, పీజీ
ప్రవేశాల గడువు పెంపు - 31 వరకు పెంచుతూ వర్సిటీ రిజిస్ట్రార్
ప్రకటన
బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ
డిగ్రీ,
పీజీ కోర్సుల్లో ప్రవేశాల గడువును ఈనెల 31
వరకు పొడిగించినట్లు యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ జి.లక్ష్మారెడ్డి
వెల్లడించారు. ఇంటర్, నేషనల్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా
ఇంటర్ పూర్తి చేసిన వారు వర్సిటీ నిర్వహించిన అర్హత పరీక్షల్లో 2016-2020 వరకు పాసైన విద్యార్థులు కూడా నేరుగా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్
పొందొచ్చని శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్ పొంది పలు కారణాలతో
సకాలంలో ట్యూషన్ ఫీజు చెల్లించలేకపోయిన డిగ్రీ సెకండియర్, థర్డ్
ఇయర్ విద్యార్థులు.. పీజీ కోర్సుల్లో చేరి అడ్మిషన్ ఫీజు సకాలంలో కట్టలేకపోయిన
వారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. వివరాలను www.braouonline.in వెబ్ సైట్లో పొందుపర్చినట్లు
పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 040-23680251 & 7382929 570/580/590/600
ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చని తెలిపారు.
0 Komentar