CBSE Extends Application Deadline for
Single Girl Child Scholarship 2020
టెన్త్ పాసైన అమ్మాయిలకు సీబీఎస్ఈ
స్కాలర్‌షిప్.. ఇలా దరఖాస్తు చేసుకోండి
పదోతరగతి ఉత్తీర్ణులైన అమ్మాయిలకు గుడ్‌న్యూస్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (CBSE) స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువును పొడిగించింది. ఇటీవలే దరఖాస్తు గడువు ముగియడంతో ఈ డెడ్‌లైన్‌ను పొడిగించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీబీఎస్‌ఈ) సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని విద్యార్థినులకు మరో అవకాశం కల్పించింది. మెరిట్ విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలవడంతో పాటు బాలిక విద్య కోసం తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు సీబీఎస్ఈ ఈ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థినులకు ఏడాదికి రూ. 6 వేల చొప్పున స్కాలర్ షిప్ అందించనున్నారు.
స్కాలర్‌షిప్ రెన్యువల్ చేయాలనుకునేవారితో పాటు కొత్తగా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 21 వరకు అవకాశం ఉంది. ఇక ఆన్‌లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీ సబ్మిట్ చేయడానికి 2021 జనవరి 8 చివరి తేదీ. ఇప్పటికే ఈ స్కాలర్‌షిప్ స్కీమ్ ద్వారా ఆర్థికంగా సహకారం పొందుతున్న విద్యార్థినులు రెన్యువల్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సీబీఎస్ఈ అధికారిక వెబ్‌సైట్ https://cbse.nic.in/ లో పూర్తి వివరాలు ఉంటాయి.
నిబంధనలు:
దరఖాస్తు చేసుకునే విద్యార్థిని
తల్లిదండ్రుల ఏకైక సంతానం అయి ఉండాలి.
సీబీఎస్ఈలో పది తరగతిని 60
శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి.
సీబీఎస్ఈ బోర్డు అనుబంధ
విద్యాసంస్థలోనే 11, 12 తరగతులను చదువుతుండాలి.
టెన్త్‌లో ట్యూషన్ ఫీజు నెలకు రూ.1500 మించి ఉండకూడదు.
దరఖాస్తు విధానం:
తొలుత విద్యార్థులు https://cbse.nic.in/
వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Single Girl Child
Scholarship-2020 లింక్ కనిపిస్తోంది.
CLICK HERE TO APPLY పైన
క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో Fresh
Application, Renewal లింక్స్ వేర్వేరుగా ఉంటాయి.
Apply Online పైన క్లిక్
చేసిన తర్వాత గైడ్‌లైన్స్ పూర్తిగా చదివి దరఖాస్తు చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్
చేయాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని కాపీని జాగ్రత్తగా దాచుకోవాలి.
0 Komentar