ప్రభుత్వం ఉద్యోగులకు కరోనా కోత జీతాల బకాయిలు విడుదల - జనవరి 15లోగా ఏప్రిల్ నెల బకాయిలు
కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో
ప్రభుత్వం ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి కోత
విధించిన 50 శాతం జీతాలలో మార్చి నెల కోత జీతం తాలూకు బకాయిల
సొమ్ము బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. వీరితోపాటు ప్రజా ప్రజాప్రతినిధులు,
అఖిల భారత సర్వీసు అధికారులకు కూడా బకాయిల సొమ్ము బాంకు ఖాతాల్లో
ప్రభుత్వం జమ చేసింది. ఏప్రిల్ నెల బకాయిలు జనవరి 15లో గా
ప్రభుత్వం జమ చేయనుంది కరోనా ప్రభావంతో ప్రభుత్వానికి రాబడి తగ్గడంతో జీతాలు,
వేతనాలు, పెన్షన్లు రెండు విడతల్లో
చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేసిన
పోలీసులు, వైద్య, ఆరోగ్యశాఖ, పారిశుద్ధ్య కార్మికులకు 100 శాతం జీతాలు చెల్లించడం
జరిగింది.
0 Komentar